BREAKING
రోహిత్ శర్మకు వైస్ కెప్టెన్‌గా ఉండేందుకు బుమ్రా నో.. ముంబై ఇండియన్స్‌లో ఆసక్తికర పరిణామం సిక్సర్ల వర్షంతో టిమ్ సీఫెర్ట్ విధ్వంసం.. దుబాయ్ క్యాపిటల్స్‌పై షార్జా వారియర్స్ ఘనవిజయం ఫాలోఆన్ గండం నుంచి గట్టెక్కాలంటే భారత్ ఎన్ని పరుగులు చేయాలి? రెండో టెస్టు సమీకరణం ఇదే ప్రతి హిందూ ఇంటిపై కాషాయ జెండా రెపరెపలాడాలి..* టీయూడబ్ల్యూజే–ఐజేయూ మహాసభలకు కలెక్టర్, డీపీఆర్వోకు ఆహ్వానం. : సిరాజ్‌కు ఇది మంచి ముగింపు కాదు.. జట్టు పరిస్థితిపై అశ్విన్ ఆవేదన కెప్టెన్‌గా రోహిత్ శర్మ రీఎంట్రీ.. ఐపీఎల్ 2027 ముందు ముంబై ఇండియన్స్‌లో కీలక మార్పులివే 16 బంతుల్లోనే మెరుపు అర్ధశతకం.. డబ్ల్యూబీబీఎల్ చరిత్రలో క్లోయ్ ట్రయాన్ అరుదైన రికార్డు ఘనంగా మహాత్మా జ్యోతిబా పూలే 136వ వర్ధంతి కార్యక్రమం విశ్వక్ సేన్ లెగసీ షూటింగ్ పూర్తి.. ఫిబ్రవరి 2027లో గ్రాండ్ రిలీజ్ మహాత్మా జ్యోతిబాపూలే వర్ధంతి సందర్భంగా కన్నెపల్లిలో రక్తదాన శిబిరం స్విట్జర్లాండ్ వేదికపై అన్నమయ్య బ్రహ్మమొక్కటే కీర్తన.. వైరల్ అవుతున్న అరుదైన వీడియో జీ5లో నంబర్ వన్ ట్రెండింగ్‌లో టీన్ తిగడా.. ఊహించని మలుపులతో ఆకట్టుకుంటున్న సిరీస్ మాదిగల వన భోజనాల కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి ఓయూ జేఏసీ నాయకుడు చిప్పకుర్తి రాజు మెడికల్ కళాశాలను సందర్శించిన విద్యార్థులు

విశ్వక్ సేన్ లెగసీ షూటింగ్ పూర్తి.. ఫిబ్రవరి 2027లో గ్రాండ్ రిలీజ్

Select Suryaa Now
విశ్వక్ సేన్ లెగసీ షూటింగ్ పూర్తి.. ఫిబ్రవరి 2027లో గ్రాండ్ రిలీజ్

సూర్య ఎంటర్‌టైన్‌మెంట్ డెస్క్: టాలీవుడ్ హీరో విశ్వక్ సేన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న పొలిటికల్ యాక్షన్ డ్రామా లెగసీ చిత్రీకరణ పూర్తయింది. ఈ విషయాన్ని చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. షూటింగ్ పూర్తి కావడంతో ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ సినిమాను 2027 ఫిబ్రవరిలో ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

సాయికిరణ్ రెడ్డి దైదా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని కళాహి మీడియా బ్యానర్‌పై యశ్వంత్ దగ్గుమాటి, సాయికిరణ్ రెడ్డి దైదా నిర్మిస్తున్నారు. సంజయ్ సాంబ్రాణి, వివిఎన్ ప్రసాద్ సహ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. విశ్వక్ సేన్‌కు జోడీగా ఏక్తా రాథోడ్ నటిస్తుండగా, కీలక ప్రతినాయక పాత్రలో కేకే మీనన్ కనిపించనున్నారు.

రావు రమేష్, మురళీ మోహన్, సచిన్ ఖేడేకర్, రాజీవ్ కనకాల, రాజా రవీంద్ర, ఖుషీ రవి తదితర ప్రముఖ నటులు ఈ చిత్రంలో ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. గోవింద్ వసంత సంగీతం అందిస్తుండగా, జిజు సన్నీ సినిమాటోగ్రఫీ బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

ఇటీవల ఈఎన్ఈ రిపీట్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విశ్వక్ సేన్, లెగసీ సినిమాతో మరో విభిన్న కథతో అలరించేందుకు సిద్ధమవుతున్నారు. ఫిబ్రవరి విడుదల నేపథ్యంలో రాబోయే రోజుల్లో మరిన్ని ప్రచార అప్‌డేట్లను చిత్ర బృందం విడుదల చేయనుంది.