BREAKING
స్కిల్ యూనివర్సిటీ నిర్మాణ పనులను పరిశీలించిన కేఎల్ఆర్ మురసు తుఫాన్ ప్రభావంతో దెబ్బతిన్న ఉద్యాన పంటలు క్షేత్రస్థాయిలో పరిశీలిస్తున్న అంతర్ మంత్రిత్వ శాఖల కేంద్ర బృందం గ్రామసభలో విద్యార్థుల గళం నాలుగు అడుగుల ముసలి కలకలం..! ఎల్‌నినోపై విద్యార్థుల ర్యాలీ కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషికి లోకేష్ ఘనస్వాగతం అందుబాటు ధరల్లో క్యాన్సర్ మందులు: రోగుల ప్రయోజనాలకే ప్రథమ ప్రాధాన్యం – శ్రీ జగత్ ప్రకాశ్ నడ్డా *నారాయణ బెస్ట్ ఫౌండేషన్ స్కూల్ లో ఘనంగా బాలోత్సవ వేడుకలు..* APRS సంతనూతలపాడు పాఠశాలకు ప్రశంశాపత్రం విట్లంపల్లి తాగునీటికి శాశ్వత పరిష్కారం.. లక్ష డిజిటల్ ఎంఎస్ఎంఈల తయారీకి 50 కేంద్రాలు: మంత్రి కొండపల్లి శ్రీనివాస్ రూఫ్‌టాప్ సోలార్‌లో ఏపీ దేశానికే ఆదర్శం: కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపికి తుఫాన్ ముప్పు! స్వర్ణ,డా. ప్రవీణ్ కుమార్ వివాహ రెసెప్షన్ కు హాజరైన పారిశ్రామిక వేత్త శిద్దా సుధీర్ కుమార్ సిరివెళ్ల నీటి కుంటలో తగ్గుతున్ననీటిమట్టం_ ---ఆందోళనలో గ్రామస్తులు

అధిక ఫీజుల వసూళ్లపై మండల విద్యాశాఖ అధికారికి ఫిర్యాదు

Select Suryaa Now
అధిక ఫీజుల వసూళ్లపై మండల విద్యాశాఖ అధికారికి ఫిర్యాదు

సూర్య. బీర్కూర్ : ప్రైవేటు పాఠశాలల్లో అధిక ఫీజులు వసూలు చేస్తూ విద్యార్థులకు కనీస మౌలిక వసతులు కల్పించడం లేదని ఆరోపిస్తూ సన్ రైజ్ పాఠశాలపై మండల విద్యాశాఖ అధికారి వెంకన్నకు కొర్రి కృష్ణ, బసవరాజ్ ఫిర్యాదు చేశారు.పాఠశాల యాజమాన్యం విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి అధిక మొత్తంలో ఫీజులు వసూలు చేస్తున్నప్పటికీ, అందుకు తగిన విధంగా సౌకర్యాలు కల్పించడం లేదని పిల్లలు ఆటలు ఆడడానికి కనీస స్థలం లేదని వారు ఫిర్యాదులో పేర్కొన్నారు. విద్యార్థులకు అవసరమైన కనీస వసతులు కూడా అందుబాటులో లేవని, దీంతో విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆరోపించారు.విద్యను వ్యాపారంగా మార్చకుండా విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించాల్సిన బాధ్యత పాఠశాల యాజమాన్యాలపై ఉందని పేర్కొన్నారు. అధిక ఫీజుల భారంతో సామాన్య, మధ్యతరగతి కుటుంబాలు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.ఈ విషయంపై మండల విద్యాశాఖ అధికారి వెంటనే స్పందించి సన్ రైజ్ పాఠశాలలో క్షేత్రస్థాయి తనిఖీలు నిర్వహించాలని, ఫీజుల వసూళ్లు, విద్యార్థులకు కల్పిస్తున్న సౌకర్యాలపై సమగ్ర విచారణ చేపట్టాలని  కోరారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించినట్లు తేలితే పాఠశాల యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకుంటామని మండల విద్యాధికారి తెలిపారు.