BREAKING
అలరించడానికి వస్తున్న కీర్తి సురేశ్ 'సత్యవాన్ సావిత్రి'.. ఆకట్టుకుంటున్న 'చక్కని కళ్ళ పిల్లా' సెకండ్ సింగిల్! పలమనేరు మున్సిపాలిటీపై టీడీపీ జెండా 3475 ఓట్ల ఆధిక్యంతో చైర్‌పర్సన్‌గా రాజ్యలక్ష్మి విజయం ఆత్మకూరులో ఫలించిన ఆనం వ్యూహం - మలుపు తిరిగిన రాజకీయం - బొమ్మిరెడ్డి రంగ ప్రవేశం - మున్సిపాలిటీ కైవసం నెల్లూరు రూరల్ 2వ డివిజన్‌లో టీడీపీ జయకేతనం! సబ్బవరం పరిషత్ ఎన్నికల్లో సీట్ల వివాదం... టీడీపీ తీరుపై ఆవేదన వ్యక్తం చేసిన ఎమ్మెల్యే పంచకర్ల విజయవాడ, గుంటూరులకు దీటుగా తెనాలి అభివృద్ధి చేస్తాం.... నూతన మున్సిపల్ చైర్మన్ తోటకూర మర్రిపాడులో మంత్రి ఆనం విస్తృత ఎన్నికల ప్రచారం పౌండ్‌ల్యాండ్ భవితవ్యంపై బ్రిటన్ ప్రభుత్వం ఆందోళన విద్యార్థుల సృజనాత్మకతకు వేదికగా జిల్లా స్థాయి పోటీలు బుచ్చి మున్సిపల్ ఎన్నికల ఫలితాలలో టిడిపి హవా ఫెరారీ లూస్ ఈవీకి భారీ డిమాండ్.. 2027 నాటికి అన్ని కార్లు బుక్ పూర్తి ఆధ్యాత్మిక శాస్త్రవేత్త పురస్కారం ప్రదానం; ‘శ్వాశ్వ’ గ్రంథావిష్కరణ ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ టోర్నమెంట్‌కు పాకిస్థాన్ షాహీన్స్ జట్టు ప్రకటన.. కెప్టెన్‌గా అబ్దుల్ సమద్! మురసు తుఫానుతో ఉద్యాన పంటల పరిశీలన.  హెచ్ ఓ అంజలి భాయ్ కృత్రిమ మేధస్సు రేసులో దిగ్గజ సంస్థలకు భారం.. ఆపిల్‌పై పడుతున్న వ్యయాల సెగ

అభివృద్ధిలో మునిదేవునిపల్లి ముందడుగు!

Select Suryaa Now
అభివృద్ధిలో మునిదేవునిపల్లి ముందడుగు!

కొండాపూర్‌;కొండాపూర్‌ మండల పరిధిలోని మునిదేవునిపల్లి  గ్రామం అభివృద్ధి బాటలో ముందుకు సాగుతోంది. గ్రామ సర్పంచ్‌ డి. కృష్ణ ప్రత్యేక చొరవతో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యం ఇస్తూ గ్రామాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నారు. శంకర్‌పల్లికి సమీపంలో ఉండటం, నార్సింగికి రహదారి అనుసంధానం, ఆహ్లాదకరమైన ప్రకృతి వాతావరణం కారణంగా గ్రామ శివారులో భారీ వెంచర్లు ఏర్పాటయ్యాయి. భవిష్యత్తులో నిర్మాణాలు ప్రారంభమైతే గ్రామ పంచాయతీకి ఆదాయం సమకూరే అవకాశం ఉందని గ్రామస్తులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.నిధుల కొరత ఉన్నా.. అభివృద్ధే లక్ష్యంసర్పంచ్‌గా ఎన్నికైనప్పటి నుంచి గ్రామ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించినట్లు కృష్ణ తెలిపారు. గ్రామంలో సీసీ రోడ్లు, అండర్‌ డ్రైనేజీ, వీధి దీపాల ఏర్పాటు వంటి మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తున్నామన్నారు. ఎన్నో సంవత్సరాలుగా గ్రామానికి ఆధారంగా ఉన్న ఏకైక బావికి మరమ్మతులు చేయించామని పేర్కొన్నారు.గ్రామ పంచాయతీకి నిధుల కొరత ఉన్నప్పటికీ దాతల సహకారంతో అభివృద్ధి పనులు చేపడుతున్నామని తెలిపారు. వినాయక నిమజ్జనం, దసరా పండుగలను ఘనంగా నిర్వహిస్తూ గ్రామంలో ఐక్యత, పండుగ వాతావరణాన్ని పెంపొందిస్తున్నామన్నారు.ప్రజల నమ్మకమే బలం ప్రజలు తనపై నమ్మకంతో సర్పంచ్‌గా గెలిపించారని, వారికి ఇచ్చిన మాట ప్రకారం గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని కృష్ణ స్పష్టం చేశారు. తన పదవీకాలంలో మునిదేవునిపల్లిని  ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దడమే లక్ష్యమన్నారు.ఉపసర్పంచ్‌ వరలక్ష్మి కిష్టారెడ్డి, పంచాయతీ కార్యదర్శి దినేష్‌, పాలకవర్గ సభ్యులు, గ్రామ పెద్దలు, యువత, గ్రామస్తుల సహకారంతో అభివృద్ధి కార్యక్రమాలను మరింత ముందుకు తీసుకెళ్తామని సర్పంచ్‌ కృష్ణ తెలిపారు. అధికారుల, ప్రజాప్రతినిధుల సహకారంతో గ్రామానికి అవసరమైన అన్ని మౌలిక సదుపాయాలను సమకూర్చేందుకు కృషి చేస్తామన్నారు.