BREAKING
కాంగ్రెస్ ప్రభుత్వం తోనే నిరుపేద ప్రజల కలలు సాకారం దుప్పట్లు పంపిణీ ఎం ఆర్ పల్లి లో ఎన్నికల నామినేషన్ల సందడి.. ఎంఆర్ పల్లి వాసులకు ట్రాఫిక్ కష్టాలు! అవగాహన రాహిత్యంతో బారికేడ్ల ఏర్పాటు... పరకాల స్మశాన వాటిక ఆధునికరణకు పోచంపల్లి ఫౌండేషన్ ముందడుగు గ్రంథాలయాల అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం 59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల్లో ఘనంగా సాహిత్య సదస్సు సాహితీవేత్తలను సత్కరించిన గ్రంథాలయ సంస్థ చైర్మన్ డా.గురవారెడ్డి చంద్రగిరి నియోజకవర్గంలో ప్రశాంతంగా తొలిరోజు నామినేషన్ల పర్వం – 20 కేంద్రాల్లో 107 పంచాయతీలు,1,198 వార్డులకు నామపత్రాల దాఖలు కొరుప్రోలు కొబ్బరి పీచు పరిశ్రమలో అగ్నిప్రమాదం! కె జె పురం శాఖ గ్రంధాలయం 59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవములు ప్రభుత్వ ఆదేశాలు భేఖతర్ ఎమ్మార్పీ కన్నా మద్యం అధిక ధరలు నకిలీ విడుదల వారంటూ పేరుతో ఫోర్జరీ చేసిన ముగ్గురు వ్యక్తుల అరెస్టు రాష్ట్రస్థాయి అండర్ 13 సబ్ జూనియర్ బ్యాడ్మింటన్ ఛాంపియన్ గా పృద్వి మణికంఠ వరాహ నది బాధిత కుటుంబాలకు హోంమంత్రి అనిత పరామర్శ గ్రంథాలయాలే సరస్వతి నిలయాలు -పుస్తక పఠనంతోనే ఉన్నత శిఖరాలు అధిరోహించండి -కవి సమ్మేళనంలో గ్రంథాలయ చైర్మన్ డాక్టర్ రెడ్డివారి గురువారెడ్డి పిలుపు తుపాను ముప్పు.. అప్రమత్తంగా ఉండండి! టిడిపి వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేషన్ కలిసిన మేయర్ జేబీ శ్రీనివాస్

ఆకలితో అలమటిస్తున్న అభాగ్యుడు.. ఆదుకునే ఆపన్నహస్తం కోసం ఎదురుచూపులు

Select Suryaa Now
ఆకలితో అలమటిస్తున్న అభాగ్యుడు.. ఆదుకునే ఆపన్నహస్తం కోసం ఎదురుచూపులు

మేడ్చల్  మేజర్‌ న్యూస్‌ :  ఆపదలో ఉన్న తోటి మనిషిని ఆదుకునే మానవత్వం ఎక్కడ? అన్న ప్రశ్నకు నూతనకల్‌ గ్రామంలో చోటుచేసుకున్న ఘటన అద్దం పడుతోంది. ఎల్లంపేట మున్సిపాలిటీ పరిధిలోని నూతనకల్‌కు చెందిన వడ్ల శేఖర్‌ అనారోగ్యంతో బాధపడుతూ, ఆదుకునే వారు లేక తీవ్ర దుర్భర పరిస్థితుల్లో కాలం వెళ్లదీస్తున్నాడు. గత నాలుగు రోజులుగా సరైన ఆహారం లేకుండా, చలిలో రోడ్డుపైనే దీనస్థితిలో ఉన్నట్లు స్థానికులు చెబుతున్నారు. అనారోగ్యంతో కనీసం తన అవసరాలు తీర్చుకోలేని స్థితిలో ఉన్న అతడిని పట్టించుకునే వారు లేకపోవడం స్థానికులను కలచివేస్తోంది.  ఒకవైపు మానవత్వం, సేవాభావం గురించి గొప్పగా మాట్లాడుతున్న సమాజంలో మరోవైపు ఆపదలో ఉన్న అభాగ్యుడికి అండగా నిలిచేవారు కరువవడం ఆవేదన కలిగిస్తోంది. కనీసం తిండి, నీడ లేక ఇబ్బందులు పడుతున్న వ్యక్తికి సహాయం అందించేందుకు ఎవరూ ముందుకు రాకపోవడంపై స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎల్లంపేట మున్సిపల్‌ అధికారులు, ప్రజాప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థలు తక్షణమే స్పందించి వడ్ల శేఖర్‌కు వైద్య సహాయం అందించాలని స్థానికులు కోరుతున్నారు. ఆహారం, ఆశ్రయం కల్పించడంతో పాటు అవసరమైతే ప్రభుత్వ ఆశ్రయ కేంద్రానికి తరలించి, ఆయన ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.ఆపదలో ఉన్న వ్యక్తికి అందించే చిన్న సహాయం కూడా ఒక ప్రాణాన్ని నిలబెట్టవచ్చు. సమాజంలోని ప్రతి ఒక్కరూ మానవతా దృక్పథంతో స్పందించి వడ్ల శేఖర్‌కు అండగా నిలవాల్సిన అవసరం ఉంది.