BREAKING
ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలి.. అధికారులకు ఏపీసీపీడీసీఎల్ సీఎండీ పి. పుల్లారెడ్డి ఆదేశం మండలంలో జోరందుకున్న నామినేషన్ల పర్వం ఏకగ్రీవం అభివృద్ధికి మార్గం..! చిత్రగుప్త యాప్‌పై అధికారులకు శిక్షణ.. వారం రోజుల్లో క్షేత్రస్థాయి పరిశీలన పూర్తి చేయాలి.. నవంబర్ 22లోగా వివరాల నమోదు చేయాలి రెండో రోజు నామినేషన్ ల వెలువ నారన్నాయుడు వలస లో 10 కుటుంబాలు వైసీపీని వీడి టీడీపీలో చేరిక వేసవిలో తాగునీటి ఎద్దడి రాకుండా చర్యలు : జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి ఆశా వర్కర్ల సమస్యలు పరిష్కరించాలి మధుమేహం నివారిద్దాం - ఆరోగ్యకరమైన జీవితాన్ని గడుపుదాం విదేశీ ఉద్యోగాలపై నిరుద్యోగ యువతకు బంపర్‌ అవకాశం జర్మనీ, జపాన్, అమెరికా, దుబాయ్‌ సహా పలు దేశాల్లో ఉద్యోగాలు ఈ నెల 20న పెద్దపల్లిలో రిజిస్ట్రేషన్‌ మేళా శివనామస్మరణతో మార్మోగిన శైవక్షేత్రాలు రాబోయే ఎన్నికల్లో బీసీలకు అత్యధిక స్థానాలు కల్పించేందుకు బీసీ దళ్ రెడీ:తెలుగు రాష్ట్రాల అధ్యక్షులు డి.వి.వి. సత్యనారాయణ గ్రంధాలయ ఉద్యమ నాయకులకు ఘన నివాళులు ఖేలో ఇండియా యూత్ గేమ్స్‌ను ఘనంగా నిర్వహించాలి డిసెంబర్ 11 నుంచి 22 వరకు పోటీలు ​కె.వి.ఆర్. ఇంటర్మీడియట్ కళాశాల గుర్తింపు రద్దు చేయాలి ​సీపీఐ, ఏఐఎస్ఎఫ్ నాయకుల డిమాండ్

తాలు, పొట్టు లేని నాణ్యమైన ధాన్యాన్ని కేంద్రాలకు తీసుకురండి - మార్కెట్ కమిటీ ఛైర్మన్ రేవెల్లి రాజలింగం సూచన

Select Suryaa Now
తాలు, పొట్టు లేని నాణ్యమైన ధాన్యాన్ని కేంద్రాలకు తీసుకురండి - మార్కెట్ కమిటీ ఛైర్మన్ రేవెల్లి రాజలింగం సూచన

సూర్య - మానకొండూర్ : రైతులు దళారులను ఆశ్రయించి నష్టపోకుండా ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యాన్ని విక్రయించి మద్దతు ధర పొందాలని మార్కెట్ కమిటీ ఛైర్మన్ రేవెల్లి రాజలింగం సూచించారు. మానకొండూరు ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ ఆదేశాల మేరకు మండలంలోని అన్నారం, లింగాపుర్, కెల్లెడ, గంగిపల్లి, కొండపల్కల గ్రామాలలో సోమవారం వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. మానకొండూరు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (ప్యాక్స్) ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కేంద్రాలను మార్కెట్ కమిటీ ఛైర్మన్ రేవెల్లి రాజలింగం, ప్యాక్స్ ఛైర్మన్ నాగిశెట్టి రాజయ్య కలిసి ప్రారంభించారు.ఈ సందర్భంగా అన్నారంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రేవెల్లి రాజలింగం మాట్లాడుతూ...  తాలు, పొట్టు లేని నాణ్యమైన వడ్లను కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చి రైతులు 40 కిలోల 600 గ్రాముల కాంట వేయడం జరుగుతుందన్నారు.రూ.2,461 కనీస మద్దతు ధరను పొందాలని కోరారు. తాలుతో కూడిన ధాన్యాన్ని తీసుకువస్తే మిల్లర్లు 2 నుంచి 3 కిలోల వరకు తరుగు తీసే అవకాశం ఉందని, కాబట్టి తరుగుకు ఆస్కారం లేకుండా శుభ్రం చేసిన వడ్లనే తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు. సన్న వడ్లకు ప్రభుత్వం అందించే బోనస్ కూడా ఖచ్చితంగా అందుతుందని, సన్న వడ్లను సైతం దళారులకు కాకుండా ప్రభుత్వ కేంద్రాల్లోనే విక్రయించాలని తెలిపారు ఈ కార్యక్రమంలో సర్పంచులు వాల ప్రదీప్ రావు, ఆడెపు రజిత,మండల కాంగ్రెస్ అధ్యక్షుడు ద్యావ శ్రీనివాస్ రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు తాళ్ల పెల్లి సంపత్ గౌడ్, నాయకులు మర్రి ఓదెలు, కనకం అశోక్ ,బుర్ర శ్రీకాంత్ గౌడ్, కొట్టే అంజిరెడ్డి, మాడ తిరుపతి రెడ్డి,రాపాక రాజేశ్వర్, దూలం వీరస్వామి, మాశం రామకృష్ణ, బండి సమ్మయ్య, కడారి ప్రభాకర్, మట్టెపల్లి ఆంజనేయులు,ఎంసీ డైరెక్టర్లు, ప్యాక్స్ డైరెక్టర్లు, కిసాన్ సెల్ అధ్యక్షులు,గ్రామ శాఖ అధ్యక్షులు, మహిళలు, రైతులు పాల్గొన్నారు.