BREAKING
తెలంగాణ సంస్కృతికి ప్రతీక బతుకమ్మ డిండి ప్రాజెక్టుకు ఏదుల నుంచే నీరివ్వాలి...! చిన్న వెంకన్న ఆలయానికి అమావాస్య ఎఫెక్ట్ కన్యకా పరమేశ్వరి ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం నేడే సీఐ ని సన్మానించిన లయన్స్ క్లబ్. పేదలకు వస్త్ర, అన్నదాన కార్యక్రమం ఎంబీబీఎస్ సీటు సాధించిన రాథోడ్వ విష్ణువర్షను సన్మానించిన ఎమ్మెల్యే అనిల్ జాదవ్ 108 అంబులెన్స్‌లో సుఖ ప్రసవం.. విద్యార్థినులు సామాజిక సేవలో భాగస్వామ్యులు కావాలి నేటి నుండి శ్రీ దేవీ శరన్నవరాత్రులు టిజి మోడల్ స్కూల్, నాగసముద్రాల లో సమాచార హక్కు చట్టానికి తూట్లు సిఐ ని కలిసిన మండల టిడిపి అధ్యక్షులు. 2 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యం పట్టివేత కూటమి ప్రభుత్వం డ్రామాలు బట్టబయలు... మైత్రి లేఔట్ లో రోడ్డు సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటాం వైయస్ మనోహర్ రెడ్డి

సంప్రదాయాల సందడితో గ్రీన్‌వుడ్‌లో దసరా వేడుకలు

Select Suryaa Now
సంప్రదాయాల సందడితో గ్రీన్‌వుడ్‌లో దసరా వేడుకలు
సూర్య, మందమర్రి: విద్యార్థుల్లో తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాల పట్ల అవగాహన కల్పించే లక్ష్యంతో మందమర్రి మండలం తిమ్మాపూర్‌లోని గ్రీన్‌వుడ్ సీబీఎస్‌ఈ పాఠశాలలో శుక్రవారం ముందస్తు దసరా వేడుకలను ఘనంగా నిర్వహించారు. పూలతో బతుకమ్మలను పేర్చిన విద్యార్థులు, మహిళా ఉపాధ్యాయినులు సంప్రదాయ ఆటపాటలతో సందడి చేశారు. అనంతరం పాఠశాల ప్రాంగణంలో భారీ రావణాసురుడి ప్రతిమను దహనం చేసి వేడుకలకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఈ సందర్భంగా పాఠశాల డైరెక్టర్ డాక్టర్ భరద్వాజ నాయుడు మాట్లాడుతూ.. దసరా పండుగ చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక అని పేర్కొన్నారు. దేవీ నవరాత్రులు, విజయదశమి వేడుకలు భక్తి, ఐక్యత, సాంస్కృతిక విలువలను చాటుతాయని తెలిపారు. విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, సిబ్బందికి దసరా శుభాకాంక్షలు తెలియజేశారు. అలాగే పాఠశాల డైరెక్టర్ ఆకర్ష్ నాయుడు, ఏజీఎం పవన్ కుమార్, ప్రిన్సిపాల్ చంద్రమోహన్ కూడా శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో హెడ్‌మిస్ట్రెస్ క్రిస్టినా, వైస్ ప్రిన్సిపాల్ తిరుపతి, ఏవో ఖుద్దూస్, ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.