telanagana
అక్రమ మద్యం పట్టివేత
సూర్య నిజామాబాద్ క్రైమ్ : అక్రమ మద్యం, అసాంఘిక కార్యకలాపాల నిరోధక చర్యల్లో భాగంగా నిజామాబాద్ జిల్లాలో ఎక్సైజ్ శాఖ అధికారులు ఉక్కుపాదం మోపుతున్నారు. అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్, నిజామాబాద్ ఆదేశానుసారం జిల్లా నషా గత్ త్రి రోజులుగా సంయుక్త దాడులు నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు.
ఇందులో భాగంగా గతరాత్రి నిజామాబాద్ పట్టణం పరిధిలోని న్యావల్కల్ రస్తా మరియు ముబారక్ నగర్ లోని కంకణాల గంగారత్నం మరియు ముడ భాస్కర్ ఇంళ్ల యందు తనిఖీలు నిర్వహించారు. ఈ దాడుల్లో వారి వద్ద నుండి (110) విస్కీ మద్యం మరియు డిఫెన్స్ మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ మద్యం బాటిళ్లను వీరు విశాఖ నుండి వచ్చిన వారి నుండి మరియు ఇతర మార్గాల ద్వారా డిఫెన్స్ మద్యం తక్కువ ధరకు కొనుగోలు చేసి ఇక్కడ అవసరమైన వ్యక్తులకు విక్రయించుకుంటున్నట్లు తేలింది.ఈ దాడుల్లో ఎండీ. నజీర్ హుస్సేన్ , బి. గజేందర్, ఎక్సైజ్ ఇన్‌స్పెక్టర్లు (ఎన్ఫోరసెమెంట్, నిజామాబాద్) మరియు ఎం. సరిత , ఎస్ ఎహ్ o, నిజామాబాద్ మరియు సిబ్బంది పాల్గొన్నారు.