మైత్రి లేఔట్ లో రోడ్డు సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటాం వైయస్ మనోహర్ రెడ్డి
పులివెందుల మేజర్ న్యూస్:
ప్రజల సమస్యలను తెలుసుకుని వాటి పరిష్కారానికి కృషి చేసే లక్ష్యంతో చేపట్టిన ఆత్మీయ పలకరింపు కార్యక్రమంలో భాగంగా వైఎస్ మనోహర్ రెడ్డి మైత్రి లే అవుట్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజలతో మాట్లాడి, వారు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
మైత్రి లే అవుట్‌లో నెలకొన్న రోడ్డు సమస్యను స్థానికులు ఆయన దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై స్పందించిన వైఎస్ మనోహర్ రెడ్డి సమస్యను పరిశీలించి, రోడ్డు సమస్య పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ప్రజలకు రాకపోకల్లో ఇబ్బందులు కలగకుండా సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు. ప్రజల అవసరాలను గుర్తించి, వారికి మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించేందుకు కృషి చేస్తామని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ వరప్రసాద్, మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ చిన్నప్ప, రసూల్, పట్టణ అధ్యక్షుడు హాల్ గంగాధర్ రెడ్డి, పట్టణ ఉపాధ్యక్షుడు పార్నపల్లి కిషోర్, వైసీపీ నాయకులు నరసింహారెడ్డి, సురేష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, మోట రాజశేఖర్, రామకృష్ణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.