BREAKING
దసరా సెలవుల నేపథ్యంలో జిల్లాలోని సముద్రతీరాలకు వచ్చే పర్యాటకుల భద్రతకు పటిష్ట చర్యలు ఉచిత వైద్య శిబిరాల ఏర్పాటు అభినందనీయం అద్దంకి రాజీవ్ కాలనీలో పోలీసుల 'కార్డన్ సెర్చ్'.. కలపను అక్రమంగా తరలిస్తున్న వాహనాన్ని పట్టుకున్న ఫారెస్ట్ అధికారులు పాకల బీచ్‌లో పెను విషాదం.. సముద్ర అలలకు ఇద్దరు బలి! వీరబ్రహ్మేంద్రస్వామి చరిత్రను జనబాహుళ్యంలోకి తీసుకెళ్లాలి : జనా ప్రసాద్ పిలుపు ఇంద్రకీలాద్రి పై కనకదుర్గమ్మ దసరా సంబరం కుక్కల సూరమ్మ చిత్రపటానికి బీజేపీ నాయకుల ఘన నివాళులు రైజ్ లో నేడు ఘనంగా ఫ్రెషర్స్ డే వేడుకలు డివిస్ కంపెనీల ఉద్యోగాలు సాధించిన ఎస్ ఎస్ ఎస్ డిగ్రీ కళాశాల విద్యార్థులు జగ్గయ్యపేట అభివృద్ధికి రూ.15 కోట్లతో HAM గ్రాంటు పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ (తాతయ్య), కేడీసీసీ బ్యాంక్ చైర్మన్ నెట్టెం రఘురామ్ కొత్తగూడలో ఘనంగా బతుకమ్మ వేడుకలు ఫెలో ల్యాండ్ కి ఆర్డీఎస్ కిట్స్ సిద్దం : వ్యవసాయ శాఖ ఏఓ మజ్జి చెయ్యరులో కనకదుర్గమ్మ ఆలయ వివాదం.. నవరాత్రి పూజలకు అడ్డంకి మనస్థాపంతో వ్యక్తి అదృశ్యం

కూటమి ప్రభుత్వం డ్రామాలు బట్టబయలు...

Select Suryaa Now
కూటమి ప్రభుత్వం డ్రామాలు బట్టబయలు...

శ్రీకాకుళం, సూర్య : స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు తీర్పును సాకుగా చూపిస్తూ కూటమి ప్రభుత్వం భజన రాజకీయం చేస్తోందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రీకాకుళం జిల్లా అధ్యక్షుడు, మాజీ ఉపముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ తీవ్రంగా ధ్వజమెత్తారు. చట్టబద్ధత లేని జీవోలు ఇచ్చి, న్యాయస్థానంలో నిలబడదని తెలిసి కూడా ప్రభుత్వం కావాలనే బీసీలను మోసం చేసిందని మండిపడ్డారు.
నాటకాలన్నీ బీసీ ఓట్ల కోసమే నని కూటమి ప్రభుత్వం వైఖరిని తీవ్రంగా తప్పుపట్టారు:
* డెడికేటెడ్ కమిషన్ నివేదిక ఏది?: "సుప్రీంకోర్టు తీర్పుల ప్రకారం 50 శాతం పరిమితి దాటాలంటే ప్రత్యేక డెడికేటెడ్ కమిషన్ ద్వారా సమగ్ర వివరాలు  సేకరించాలి. అది పక్కనపెట్టి యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే ఆధారంగా జీవోలు ఇచ్చి, కోర్టులో కొట్టివేసేలా కుట్ర చేశారు. ఇప్పుడు కోర్టు తీర్పును సాకుగా చూపిస్తూ ప్రభుత్వం తమ తప్పును కప్పిపుచ్చుకోవడానికి భజన చేస్తోంది."
* బీసీల పట్ల చిత్తశుద్ధి లేదు: "ఎన్నికల ముందు ఇచ్చిన 34 శాతం హామీని నెరవేర్చే ఉద్దేశం చంద్రబాబు ప్రభుత్వానికి లేదు. న్యాయ నిపుణులు ముందే హెచ్చరించినా పట్టించుకోకుండా, కోర్టుతో కొట్టించేసి 'మేం ఇచ్చాం కానీ కోర్టు ఒప్పుకోలేదు' అని బీసీలను మళ్లీ వంచించే కుట్రకు తెరలేపారు."
* "వైఎస్సార్‌సీపీ హయాంలో జగన్ మోహన్ రెడ్డి చట్ట పరిమితులకు లోబడి పనిచేస్తూనే... కేబినెట్, జెడ్పీ పీఠాలు, నామినేటెడ్ పదవుల్లో బీసీలకు 50 శాతానికి పైగా సింహభాగం ప్రాధాన్యత ఇచ్చారు. స్థానిక ఎన్నికల్లో ఓటమి భయంతోనే కూటమి నేతలు ఇటువంటి డ్రామాలు ఆడుతున్నారు. ఇప్పటికైనా చంద్రబాబు అసత్య ప్రచారాలు ఆపి బీసీ సమాజానికి క్షమాపణ చెప్పాలి." అని డిమాండ్ చేశారు.

 

రిపోర్టర్ : గోపాల్ కృష్ణ, నరసన్నపేట, శ్రీకాకుళం జిల్లా.