సి.ఎస్.ఐ బేతేలు ఆశ్రమంలో కోడూరి మల్లేశం వర్ధంతి వేడుకలు
సీఎస్ఐ బేతేలు ఆశ్రమంలో కోడూరి మల్లేశం వర్ధంతి వేడుకలు
పరకాల, అక్టోబర్ 4, మేజర్ న్యూస్
కోడూరి మల్లేశం సార్ 6వ వర్ధంతిని పురస్కరించుకుని ఆదివారం పరకాలలోని స్థానిక సీఎస్ఐ బేతేలు ఆశ్రమంలో విద్యార్థినీ, విద్యార్థులకు అన్నదాన కార్యక్రమాన్ని ఆయన అభిమానులు నిర్వహించారు. ఈ సందర్భంగా బ్లాక్ కాంగ్రెస్ మాజీ అధ్యక్షులు, మాజీ 1వ వార్డు కౌన్సిలర్, సమన్వయ కమిటీ సభ్యులు *మడికొండ సంపత్ కుమార్* మాట్లాడుతూ.. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విధులు నిర్వహించిన సమయంలో మల్లేశం సార్ ఎంతోమంది నిరుపేద విద్యార్థులకు అండగా నిలిచి, వారి విద్యాభ్యాసానికి సహాయ సహకారాలు అందించిన మహానీయుడని కొనియాడారు. కౌన్సిలర్‌గా ఎన్నికై తన వార్డులోని ప్రజా సమస్యలను పరిష్కరించడంలో ముందుండి, ప్రజల కోసం నిరంతరం పనిచేసి వారి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని గుర్తు చేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్ జిల్లా నాయకులు *బొచ్చు భాస్కర్*, యూత్ కాంగ్రెస్ పరకాల మండలం ప్రధాన కార్యదర్శి *సిలువేరు రాఘవ*, బొచ్చు మహేష్, రవి తదితరులు పాల్గొన్నారు..