దసరా ఉత్సవాల ఆహ్వాన పత్రిక ఆవిష్కరణ
దసరా ఉత్సవాల ఆహ్వాన పత్రిక ఆవిష్కరణ
- శ్రీదుర్గమ్మ ఆలయ వ్యవస్థాపకుడు ఎం.రవికుమార్ రెడ్డి
వేంపల్లె మేజర్ న్యూస్:
స్థానిక సాయి నగర్ లో వెలసిన శ్రీదుర్గమ్మ ఆలయంలో దసరా ఉత్సవాల ఆహ్వాన పత్రిక ఆవిష్కరణ చేసినట్లు ఆలయ వ్యవస్థాపకుడు ఎం.రవికుమార్ రెడ్డి వెల్లడించారు. ఈనెల 11 నుండి 20వ తేది వరకు దసరా ఉత్సవాలను అత్యంత వైభవోపేతంగా నిర్వహించేందుకు సన్నద్ధం చేశామన్నారు. ఉత్సవాల్లో భాగంగా పది రోజులు శాస్త్రోక్తమైన విశేష పూజలు, వివిధ అవతరాల్లో దుర్గమ్మను ప్రత్యేక అలంకరణ చేయించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించనున్నట్లు తెలిపారు. అక్టోబర్ 20న శమీదర్శనం అనంతరం అంగరంగ వైభవంగా మంగళ వాయిద్యాల నడుమ దుర్గమ్మ గ్రామోత్సవాన్ని ఏర్పాటు చేశామన్నారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని తమ భక్తిని చాటుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకుడు శాకల్య విష్ణుశర్మ, కమిటీ సభ్యులు కొత్తూరు రెడ్డయ్య, తిరుమల రెడ్డి, విశ్వనాథ్ తదితరులు పాల్గొన్నారు.