సికింద్రాబాద్‌లో దారుణం: జొమాటో బాయ్‌పై భార్యాభర్తల దాడి
వాసవినగర్ (సికింద్రాబాద్):యాప్ లొకేషన్ సరిగ్గా చూపించకపోవడంతో ఆర్డర్ తీసుకురావడం కాస్త ఆలస్యమైందని చెప్పిన జొమాటో డెలివరీ బాయ్‌పై దంపతులు విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డారు.
డెలివరీ ఆలస్యానికి గల కారణాన్ని వివరించేందుకు ప్రయత్నించినప్పటికీ వినకుండా కస్టమర్ గొడవకు దిగాడు. ఈ క్రమంలో భార్యాభర్తలిద్దరూ కలిసి డెలివరీ బాయ్‌పై తీవ్రంగా దాడి చేశారు.
ఈ ఘటనపై ఫిర్యాదు చేసినప్పటికీ పోలీసులు కేవలం "పెట్టీ కేసు" మాత్రమే నమోదు చేయడంతో స్థానిక డెలివరీ బాయ్స్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ రక్షణపై ఆందోళన వ్యక్తం చేస్తూ, బాధితుడికి న్యాయం చేయాలని మరియు దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.