BREAKING
కుటుంబ కలహాల నేపథ్యంలో యువతి ఆత్మహత్య పదవీ విరమణ కార్యక్రమంలో పాల్గొన్న : తాండ్ర ఈనెల 10 11 వ తేదీన హైదరాబాద్ జరిగే రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయండి సమాజానికి మార్గదర్శకులు మీరే : అంతర్జాతీయ ఉపాధ్యాయ దినోత్సవ సభలో ఎం ఎల్ ఏ దామచర్ల జనార్ధన్ రావు అనాధ వృద్ధులకు అన్నదానం దుప్పట్లు పంపిణీ వరుణ దేవుని కోసం మహా యజ్ఞం -తాతయ్య గుంట గంగమ్మకు 108 బిందెల జలాభిషేకం మార్పుతోనే ఆరోగ్యకరమైన సమాజం... ప్రజా సంఘాలు మంత్రి బీసీ ని మర్యాదపూర్వకంగా కలిసిన ఏపీడబ్ల్యూజేఎఫ్ నాయకులు కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శికి సన్మానం దివ్యాంగులకు లాయర్ కరుణాకర్ రెడ్డి చేయూత సింగీతం శ్రీనివాసరావు ఇక లేరనే వార్త బాధాకరం: జూ. ఎన్టీఆర్‌ మద్దయ్య యాదవ్ ను సన్మానించిన మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి దసరా ఉత్సవాల ఆహ్వాన పత్రిక ఆవిష్కరణ జగన్ నోరు తెరిస్తే అబద్ధాలు… రాయలసీమ అభివృద్ధిపైనా విషప్రచారమేనా? : వ్య‌వ‌సాయ శాఖ మంత్రి కింజ‌రాపు అచ్చెన్నాయుడు శ్రీనారాయణస్వామి దేవస్థానంలో విశేషపూజలు

నంద్యాల మూడవ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలోని కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్- సీఐ వేణుగోపాల్

Select Suryaa Now
నంద్యాల మూడవ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలోని కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్- సీఐ వేణుగోపాల్

నంద్యాల అర్బన్: నంద్యాల మూడవ పట్టణ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రైల్వే స్టేషన్‌ మరియు పరిసర ప్రాంతాలలో ముందస్తు భద్రతా చర్యల్లో భాగంగా జిల్లా ఎస్పి సునీల్ షొరాణ్ IPS ఆదేశాల మేరకు నంద్యాల సబ్ డివిజన్ ASP శ్రీమతి సుస్మిత IPS గారి సూచనలతో మూడవ పట్టణ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ వేణుగోపాల్ ఆధ్వర్యంలో కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. ఈ తనిఖీలలో రైల్వే స్టేషన్ మరియు పరిసర ప్రాంతాలతో పాటు ప్రయాణికుల రాకపోకలు జరిగే ప్రదేశాలు, సున్నితమైన మరియు అనుమానాస్పద ప్రాంతాలను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. రైల్వే స్టేషన్ పరిసరాల్లో ఉన్న వాహనాలను కూడా పరిశీలించారు. అనుమానాస్పదంగా కనిపించిన వ్యక్తులను పూర్తిగా తనిఖీ చేసి, వారి గుర్తింపు, కదలికలపై ఆరా తీశారు. అవసరమైన చోట విచారణలు నిర్వహించారు. రైల్వే స్టేషన్‌లో ప్రయాణికుల భద్రతకు ఎలాంటి విఘాతం కలగకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టారు. ఈ తనిఖీల్లో ఎటువంటి అనుమానాస్పద వ్యక్తులు, వాహనాలు లేదా అభ్యంతరకర/చట్టవిరుద్ధ వస్తువులు గుర్తించబడలేదు. ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఇలాంటి ముందస్తు తనిఖీలు, భద్రతా చర్యలను నిరంతరం కొనసాగిస్తామని పోలీసులు తెలిపారు. ప్రజలు కూడా అనుమానాస్పద వ్యక్తులు, వస్తువులు లేదా కార్యకలాపాలు కనిపించినట్లయితే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు