మంత్రి బీసీ ని మర్యాదపూర్వకంగా కలిసిన ఏపీడబ్ల్యూజేఎఫ్ నాయకులు
బనగానపల్లె : బనగానపల్లె లోని మంత్రి క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర రోడ్లు భవనాలు పెట్టుబడులు మౌలిక సదుపాయాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డిని ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఏపీడబ్ల్యూజేఎఫ్ నంద్యాల జిల్లా అధ్యక్షులుగా ఎన్నికైన జి మద్దయ్య యాదవ్, ఉపాధ్యక్షులుగా ఎన్నికైన జి. నరసింహారెడ్డి ,జిల్లా సహాయ కార్యదర్శిగా ఎన్నికైన ఎం. రామచంద్రారెడ్డి, ఏపీ బీజేఏ నంద్యాల జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైన జవహర్ , ఉపాధ్యక్షులుగా ఎన్నికైన ఎస్ షాషావలి లు మంత్రి ని కలిసి జ్ఞాపికను అందజేసి సన్మానించారు.