BREAKING
మహిళలకు ఉచిత వృత్తి శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేయాలి: కె. సుజాత భద్రాద్రి ధర్మల్ పవర్ స్టేషన్ lo మూడో యూనిట్ నిలిచిపోవడం ప్రభుత్వ వైఫల్యమే.. మాజీ మంత్రి పువ్వాడ మాదిగ ఉద్యోగుల సమాఖ్య నూతన కమిటీకి ఘన సత్కారం ఏపీలో గృహ నిర్మాణానికి కొత్త శకం.. వైద్య ఆరోగ్యశాఖ ఔట్సోర్సింగ్ సిబ్బంది పెన్ డౌన్. మైసూరు దసరా తరహాలో విజయవాడ ఉత్సవ్‌ 2.0 విద్యార్థి దశ నుంచే క్రీడలపై ఆసక్తి పెంచుకోవాలి ఎర్రుపాలెం మండలంలో 12.89 కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అర్హులైన పట్టభద్రులు ఓటరుగా నమోదు చేసుకోవాలి కేబీఆర్ పార్క్ చుట్టూ రింగ్ రోడ్డు ఎందుకు? కళ్యాణ మండపం నిర్మాణం, భూ సమస్య పరిష్కారం కోసం వినతి "చదవడం మా కిష్టం" కార్యక్రమంకు విశేష స్పందన నీటిని పొదుపుగా వాడుకోవాలి* *మున్సిపల్ కమిషనర్ నాగరాజు* అమృతమ్మ హత్య కేసులో మరో కీలక పరిణామం ఇండస్ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి గా ‘ఇండస్ హార్ట్ ఇన్‌స్టిట్యూట్’

రాయలసీమ ప్రజల కలలను సాకారం చేసిన సీఎం చంద్రబాబు

Select Suryaa Now
రాయలసీమ ప్రజల కలలను సాకారం చేసిన సీఎం చంద్రబాబు
 
- ఫలించిన ఎమ్మెల్యే షాజహాన్ బాషా కృషి
- తెలుగుదేశం యువనేత బీదం గురునాథ్ యాదవ్ హర్షం
మదనపల్లె,మేజర్ న్యూస్ : అన్నమయ్య జిల్లా కేంద్రమైన మదనపల్లి పట్టణంలో అక్టోబర్ 2వ తేదీన రూ.లక్ష కోట్లతో  గ్లోబల్ హార్టికల్చర్ హబ్,ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ శంఖుస్థాపనతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాయలసీమ రైతుల కలలను సాకారం చేశారని మదనపల్లి మండలం,పొన్నీటిపాళ్యం పంచాయతీ,చిప్పిలికి చెందిన తెలుగుదేశం పార్టీ యువనేత బీదం గురునాథ్ యాదవ్ పేర్కొన్నారు.ఈ సందర్భంగా ఆదివారం అయన విలేకరులతో మాట్లాడుతూ గ్లోబల్ హార్టికల్చర్ హబ్ ఏర్పాటు ఓ మహోజ్వల ఘట్టమని,హేమాహేమీలైన కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మల సీతారామన్,ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు,డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్,మంత్రి నారా లోకేష్,వ్యాపారం దిగ్గజం అనంత అంబానీలు ఒకే వేదికపై కొలువుదీరిన అక్టోబర్ 2,2026 మదనపల్లె చరిత్రలో నిలిచిపోతుందన్నారు.ఇటీవలే హంద్రీ-నీవా కాలువ ద్వారా కృష్ణాజిల్లాలతో చెరువులను పూర్తిస్థాయిలో నింపడం,ప్రస్తుతం గ్లోబల్ హార్టికల్చర్ హబ్ రావడంతో రాయలసీమలో రతనాలు సిరులు కురుస్తాయని కొనియాడారు.ఈ సభలో అనంత్ అంబానీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారని,ఆయన ప్రసంగం ప్రజల్లో ఉత్తేజాన్ని నింపిందన్నారు.మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ బాషా గురించి ఎంత చెప్పినా తక్కువేనన్నారు.అతి తక్కువ సమయంలోనే నియోజకవర్గంలోని పార్టీ నాయకులు,కార్యకర్తలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ సభను దిగ్విజయం చేయడంలో ఆయన కృషి ఫలించిందన్నారు.ఇంతటి బృహత్తర కార్యక్రమంలో తాను భాగస్వామిని కావడం ఆనందంగా ఉందన్నారు.ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసిన పార్టీ నాయకులు,కార్యకర్తలకు పేరుపేరునా కృతజ్ఞతలు తెలియజేస్తున్నానన్నారు.