వైద్య ఆరోగ్యశాఖ ఔట్సోర్సింగ్ సిబ్బంది పెన్ డౌన్.
వైద్య ఆరోగ్య శాఖ ఔట్సోర్సింగ్ సిబ్బంది పెన్ డౌన్.
సూర్య అద్దంకి.
అద్దంకి సామాజిక ఆరోగ్య కేంద్రంలో ఔట్సోర్సింగ్ లో పనిచేస్తున్న సిబ్బంది ఆదివారం నుంచి పెన్ డౌన్ సమ్మె చేపట్టారు. మొత్తం ఏడుగురు సిబ్బంది పనిచేస్తున్నామని అందులో నలుగురు స్టాఫ్ నర్సులు, ఇద్దరు ల్యాబ్ టెక్నీషియన్లు, ఒక ఫార్మాసిస్టు ఉన్నారు. తమ సమస్యల పరిష్కారం కోసం గత నెల రోజులుగా వివిధ రకాలుగా ఆందోళనలు చేపట్టామన్నారు. నేటి నుంచి ఏడో తేదీ వరకు వివిధ రకాలుగా ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. అందులో భాగంగా సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయాల ముట్టడి ఉంటుందని స్టాఫ్ నర్స్ రాజవర్ధిని తెలిపారు.