మోదీ అభివృద్ధికి ఆకర్షితులై బీజేపీలోకి 50 మంది చేరిక
(అనంతపురం న్యూ టౌన్ రిపోర్టర్ తిరుపతి సురేష్)
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదిన వేడుకల్లో భాగంగా నిర్వహించిన సేవా సంకల్ప కార్యక్రమంలో గుత్తి పట్టణానికి చెందిన ప్రముఖుడు శ్రీనివాసులు తన అనుచరులతో కలిసి సుమారు 50 మందితో బీజేపీలో చేరారు.
పట్టణ, మండల అధ్యక్షులు బీసీ వెంకప్ప, పాలమూరి బాబయ్య ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆదోని శాసనసభ్యుడు డాక్టర్ పార్థసారథి నూతన సభ్యులకు పార్టీ కండువాలు కప్పి స్వాగతించారు.