"చదవడం మా కిష్టం" కార్యక్రమంకు విశేష స్పందన
గరుగుబిల్లి, అక్టోబర్ 4, మేజర్ న్యూస్:చదవడం మాకిష్టం కార్యక్రమం అద్భుతమైన కార్యక్రమమని ఈమేరకు గ్రంథాలయంలో నిర్వహిస్తున్న చదవడం మాకిష్టం కార్యక్రమానికి మంచి స్పందన లభిస్తోందని గరుగుబిల్లి శాఖా గ్రంధాలయం నిర్వాహకులు నల్ల మధుసూదనరావు పేర్కొన్నారు.మండల కేంద్రంలోని శాఖా గ్రంధాలయంలో ఆదివారం ఉమ్మడి విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాల గ్రంథాలయ సంస్థ కార్యదర్శి ఆదేశాల మేరకు చదవడం మాకిష్టం కార్యక్రమమును నిర్వహించారు.చదవడం మాకిష్టం కార్యక్రమంలో భాగంగా పధ్యములు, గద్యములు,కథలు చెప్పడం తోపాటు క్విజ్ పోటీలు స్టోరీ టెల్లింగ్ లో భాగముగా ఆదికవి నన్నయ్య జీవిత చరిత్ర విద్యార్థి చదవగా విద్యార్థులు వినడం జరిగింది.స్పోకెన్ ఇంగ్లీష్ మరియు క్రీడా పోటీల్లో భాగముగా ఈరోజు క్యారం బోర్డు, లూడో,చదరంగం బిజినెస్ మొదలగు ఆటలు ఆడించడం జరిగిందని శాఖా గ్రంధాలయం నిర్వాహకులు నల్ల మధుసూదనరావు పేర్కొన్నారు.అదే విధముగా పుస్తక పఠనము ద్వారా మనోవికాసం పెంచడం జ్ఞానాన్ని పెంపొందించడమే లక్ష్యంగా చదవడం మాకిష్టం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. ఉమ్మడి విజయనగరం పార్వతిపురం మన్యం జిల్లాల గ్రంథాలయ సంస్థ కార్యదర్శి ఆదేశాల మేరకు గ్రంథాలయంలో ప్రతి ఆదివారం చదవడం మాకిష్టం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని గ్రంథాలయ నిర్వాహకులు మధుసూదనరావు వెల్లడించారు.ఈకార్యక్రమంలో శివ్వాం బీడీసీ నిర్వాహకులు పల్ల గౌరీశ్వరరావు, సంతోషపురం బీడీసి నిర్వాహకురాలు దత్తి తేజస్విని, కోట్ల స్వామినాయుడు,నల్ల తిరుపతినాయుడుతో పాటు అధిక సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు.
సూర్య ప్రతినిధి : గరుగుబిల్లి