జల జీవన్ మిషన్ విజయానికి యారవ విస్తృత ప్రచారం
- బద్వేలులో టీడీపీ శ్రేణులకు దిశానిర్దేశం
పామూరు, మేజర్ న్యూస్ :
ప్రొద్దుటూరు వేదికగా సోమవారం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నేతృత్వంలో జరగనున్న రూ.30 వేల కోట్ల ప్రతిష్టాత్మక జల జీవన్ మిషన్ పనుల శంకుస్థాపన కార్యక్రమాన్ని విజయవంతం చేయడమే లక్ష్యంగా కార్యక్రమ ఇన్‌చార్జ్, కనిగిరి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ యారవ రమాశ్రీనివాస్ తనకు కేటాయించిన బద్వేలు నియోజకవర్గంలో ఆదివారం విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. నియోజకవర్గంలోని టీడీపీ నాయకులు, కార్యకర్తలను కలుస్తూ కార్యక్రమానికి భారీగా తరలివచ్చేలా సమన్వయం చేశారు. వెంకటశెట్టిపల్లిలో టీడీపీ నాయకులు, కార్యకర్తలతో సమావేశమైన యారవ రమాశ్రీనివాస్ వారికి దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జల జీవన్ మిషన్ శంకుస్థాపన కార్యక్రమాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నామని, ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నేతృత్వంలో జరుగుతున్న ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు. బద్వేలు నియోజకవర్గం నుంచి కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో ప్రొద్దుటూరుకు తరలివచ్చేలా నాయకులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. రేపటి కార్యక్రమంలో కూటమి శ్రేణుల బలం, ఐక్యతను చాటిచెప్పేలా ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బద్వేలు నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జ్, కడప డీసీసీబీ చైర్మన్, స్థానిక టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.