BREAKING
ఓటీటీకి వచ్చేసిన మలయాళ సెన్సేషనల్ క్రైమ్ థ్రిల్లర్... బాక్సాఫీస్ వద్ద రూ.50 కోట్లు వసూలు చేసిన సినిమా స్ట్రీమింగ్ ఎప్పుడంటే కూటమి హామీలన్నీ నీటి మూటలే.. ప్రజలకు వాస్తవాలు వివరించాలి. స్థానిక ఎన్నికలకు పార్టీ శ్రేణులు సిద్ధం కావాలి: తన్నీరు నాగేశ్వరరావు పార్టీ కార్యకర్తలకు ఐడీ కార్డుల పంపిణీ దేవర చుట్టమల్లే ఏఐ మార్ఫింగ్ వీడియోపై కుష్బూ సుందర్ తీవ్ర ఆగ్రహం.. మహిళల గౌరవం ఆటవస్తువు కాదంటూ ఘాటు వ్యాఖ్యలు ఎన్నికల సంఘం స్వతంత్ర తను కాపాడా లి ఎస్ ఐ ఆర్ ప్రక్రియ ను నిలిపివేయాలి... సీపీఐ - సిపిఎం… ఎన్నికల సంఘం స్వతంత్రతను కాపాడాలి నేడు గార్లకు రానున్న ఎమ్మెల్యే కోరం కనకయ్య కార్నెల్ విశ్వవిద్యాలయ సామూహిక అత్యాచార బాధితురాలికి బెదిరింపులు రెడ్‌క్రాస్‌ జిల్లా చైర్మన్‌గా డాక్టర్‌ ఎస్‌.ఎం. రాజేశ్వర్‌రావు స్థానిక ఎన్నికలకు వైఎస్సార్‌సీపీ సన్నద్ధం పెనుగంచిప్రోలులో పార్టీ శ్రేణులకు సభ్యత్వ కార్డుల పంపిణీ ఏఐ మార్ఫింగ్ వీడియోలపై జాన్వీ కపూర్ ఆవేదన: అనుమతి లేకుండా మహిళల చిత్రాలతో కల్పిత కంటెంట్ లైంగిక దాడికి సమానమని వ్యాఖ్య, ఎన్టీఆర్, చిరంజీవికి కృతజ్ఞతలు రాంపల్లి మరో జవహర్‌నగర్‌గా మారొద్దు.. ! సెంట్రల్ అమెరికన్ పార్లమెంట్ నుంచి తప్పుకుంటున్నట్లు నికరాగ్వా సంచలన ప్రకటన బీసీల హక్కుల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోంది... నాగండ్లలో నేత్రదానం కుమ్మరి సంఘ భవన నిర్మాణానికి సంపూర్ణ సహకారం అందజేస్తాము* నాగండ్ల లో నేత్రదానం

రూ.54 లక్షల రైస్‌మిల్లు బిల్లులపై రగడ

Select Suryaa Now
రూ.54 లక్షల రైస్‌మిల్లు బిల్లులపై రగడ

కాంగ్రెస్‌–బీఆర్‌ఎస్‌ మధ్య సవాళ్లు.. ప్రతిసవాళ్లు
మిషన్లు ఏర్పాటు చేయకుండానే బిల్లులు ఎలా డ్రా చేశారు?: రవీందర్‌రెడ్డి
ఎంబీ రికార్డులు, బిల్లులు, చెక్కులు బయటపెట్టాలని డిమాండ్‌

యాలాల, మేజర్‌ న్యూస్‌ (అక్టోబర్‌ 4): యాలాల పీఏసీఎస్‌ రైస్‌మిల్లు వ్యవహారం మరోసారి రాజకీయ దుమారం రేపింది. కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ పార్టీల మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణలు కొనసాగుతున్నాయి. రైస్‌మిల్లు పేరుతో సుమారు రూ.54 లక్షలు డ్రా చేసినప్పటికీ మిల్లింగ్‌ మిషన్లు ఏర్పాటు చేయలేదని బీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు సి.రవీందర్‌రెడ్డి ఆరోపించారు. ఆదివారం ఆయన ఆధ్వర్యంలో నిర్వహించిన మీడియా సమావేశంలో పీఏసీఎస్‌ మాజీ చైర్మన్‌ సురేందర్‌రెడ్డిని ఉద్దేశించి పలు ప్రశ్నలు సంధించారు.మిల్లింగ్‌ మిషన్లు ఏర్పాటు చేయకుండానే బిల్లులు ఎలా డ్రా చేశారని రవీందర్‌రెడ్డి ప్రశ్నించారు. రైస్‌మిల్లు వ్యవహారానికి సంబంధించిన ఎంబీ రికార్డులు, బిల్లులు, చెక్కులను ప్రజల ముందుంచాలని డిమాండ్‌ చేశారు. సుమారు రూ.2 కోట్ల విలువైన మిల్లింగ్‌ మిషన్లకు సంబంధించిన పూర్తి వివరాలను వెల్లడించాలని కోరారు. తాము బిల్లులు, ఎంబీ రికార్డులు, చెక్కులకు సంబంధించిన వివరాలను బయటపెడుతున్నామని, ఆరోపణలను ఖండిస్తున్న వారు కూడా తమ వద్ద ఉన్న పత్రాలను బహిర్గతం చేయాలని సవాల్‌ చేశారు.

అభివృద్ధిపై దృష్టి పెట్టాలి

రాజకీయ విమర్శలు, ఆరోపణలకు బదులుగా తాండూర్‌ నియోజకవర్గ అభివృద్ధిపై కాంగ్రెస్‌ నాయకులు దృష్టి సారించాలని రవీందర్‌రెడ్డి సూచించారు. చెన్నారం నుంచి పగిడిపల్లి, జుంటుపల్లి రహదారి అభివృద్ధికి ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు. బీఆర్‌ఎస్‌ సర్పంచ్‌ల పట్ల ఎమ్మెల్యే వివక్ష చూపుతున్నారని ఆరోపించారు. అన్ని గ్రామాలకు సమానంగా అభివృద్ధి పనులు, నిధులు అందేలా చూడాలని డిమాండ్‌ చేశారు.

దళితబంధుపై ఆధారాలు చూపాలి

తనపై దళితబంధు నిధుల దుర్వినియోగానికి సంబంధించి వస్తున్న ఆరోపణలను రవీందర్‌రెడ్డి ఖండించారు. తాను దళితబంధు నిధులు తీసుకున్నట్లు ఆరోపిస్తున్న వారు అందుకు సంబంధించిన ఆధారాలను బహిరంగంగా చూపాలని డిమాండ్‌ చేశారు. ఆధారాలు లేకుండా ఆరోపణలు చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

దళితులను అవమానిస్తే సహించేది లేదు

‘సావు డప్పు’ వ్యాఖ్యలపై దళిత నేత మెట్టి కృష్ణ అభ్యంతరం వ్యక్తం చేశారు. దళితులను కించపరిచేలా వ్యాఖ్యలు చేయడం సరికాదని అన్నారు. మరోసారి దళితుల పట్ల అవమానకరంగా మాట్లాడితే తీవ్రంగా స్పందించాల్సి వస్తుందని హెచ్చరించారు. దళితబంధు అంశంలో ఎవరిపై ఆరోపణలు చేస్తున్నా అందుకు ఆధారాలు చూపాలని కోరారు.కాగా, పీఏసీఎస్‌ మాజీ చైర్మన్‌ సురేందర్‌రెడ్డిపై చేసిన ఆరోపణలపై ఆయన వివరణ ఈ సమావేశంలో వెల్లడికాలేదు. సంబంధిత రికార్డులు, అధికారిక విచారణ అనంతరం వాస్తవాలు స్పష్టమయ్యే అవకాశం ఉంది. ఈ సమావేశంలో మాజీ సొసైటీ వైస్‌చైర్మన్‌ వడ్డే రాములు, మాజీ సర్పంచ్‌ అరవింద్‌రెడ్డి, శేఖర్‌రెడ్డి, శ్రీనివాస్‌, లాలు ముదిరాజ్‌, శరణు, భూపాల్‌, మాజీ సర్పంచ్‌ పటేల్‌రెడ్డి, సర్పంచ్‌ నిరటి నర్సిములు, శ్రీశైలం, మహేశ్వర్‌రెడ్డి, కృష్ణ, మంత్రి వెంకటయ్య, దేవేందర్‌గౌడ్‌, అక్కంపల్లి ఉప సర్పంచ్‌ రవీందర్‌రావు, రాములు, గణేష్‌, ముస్తాప్ప, అగ్గనూర్‌ శ్రీశైలం తదితరులు పాల్గొన్నారు.

రిపోర్టర్ ప్రకాష్ గౌడ్.