BREAKING
నేచురల్ స్టార్ నాని బ్లడీ రోమియో సినిమా హీరోయిన్ ఫిక్స్, సుజీత్ దర్శకత్వంలో క్రేజీ ప్రాజెక్ట్ బిజెపి మండల నూతన కార్యవర్గ సభ్యుల ఎంపిక ఎకగ్రీవం తపాలా లక్ష్మీ నరసింహస్వామి దేవాలయ నూతన కమిటీ ఎన్నిక ఉత్తర కొరియాతో జెట్ డ్రోన్ టెక్నాలజీని పంచుకున్న రష్యా వన్యప్రాణుల పరిరక్షణకు పరుగులు రియాద్ వేదికగా రేపు మక్కా ఒప్పంద కమిటీ సమావేశం భోజనం చేసిన తర్వాత ఛాతీలో మంట ఎందుకు వస్తుంది, కారణాలు మరియు నివారణ మార్గాలు గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరిచే అద్భుతమైన పండు దానిమ్మ, శాస్త్రవేత్తల సరికొత్త పరిశోధన పట్టభద్రుల తీర్పు.. యువత భవిష్యత్తుకు మలుపు:డా. చినుకని శివ ప్రసాద్ జ్వరం వచ్చినప్పుడు చికెన్ తినవచ్చా, వైద్యులు ఏం చెబుతున్నారు మరియు ఎలాంటి ఆహారం తీసుకోవాలి ఎమ్మెల్యే పరిటాల సునీతమ్మను కలిసిన నసనకోట ఎం జె పి విద్యా కమిటీ చైర్మన్ సౌజన్య నాగండ్ల నేత్రదానం తొలి సినిమాపై శ్రుతి హాసన్ ఆసక్తికర వ్యాఖ్యలు, నాన్న కోసమే ఆ నటన అంటున్న నటి ఎమ్మెల్యే పరిటాల సునీతమ్మను కలసి సన్మానించిన నసనకోట ఎం జె పి విద్యా కమిటీ చైర్మన్ సౌజన్య ఎస్‌ఎస్‌ రాజమౌళి వారణాసి సినిమా షూటింగ్ అప్‌‌డేట్, రికార్డు వేగంతో జక్కన్న ప్రాజెక్ట్

స్థానిక ఎన్నికలకు వైఎస్సార్‌సీపీ సన్నద్ధం పెనుగంచిప్రోలులో పార్టీ శ్రేణులకు సభ్యత్వ కార్డుల పంపిణీ

Select Suryaa Now
స్థానిక ఎన్నికలకు వైఎస్సార్‌సీపీ సన్నద్ధం  పెనుగంచిప్రోలులో పార్టీ శ్రేణులకు సభ్యత్వ కార్డుల పంపిణీ

స్థానిక ఎన్నికలకు వైఎస్సార్‌సీపీ సన్నద్ధం

పెనుగంచిప్రోలులో పార్టీ శ్రేణులకు సభ్యత్వ కార్డుల పంపిణీ

పెనుగంచిప్రోలు మేజర్ న్యూస్ ప్రతినిధి (ప్రశాంత్ )అక్టోబర్ 4: స్థానిక సంస్థల ఎన్నికలకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు సిద్ధం కావాలని జగ్గయ్యపేట నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ ఇన్‌ఛార్జ్ తన్నీరు నాగేశ్వరరావు పిలుపునిచ్చారు. పెనుగంచిప్రోలు గ్రామంలోని తంబరేణి ఫంక్షన్ హాల్‌లో గ్రామ వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఎన్నికల సన్నాహక సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా పార్టీ శ్రేణులకు సభ్యత్వ కార్డులను అందజేశారు. గ్రామంలోని వివిధ అనుబంధ విభాగాలకు చెందిన పార్టీ సభ్యులకు కూడా సభ్యత్వ కార్డులను పంపిణీ చేశారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ విజయానికి ప్రతి నాయకుడు, కార్యకర్త అహర్నిశలు కష్టపడి పనిచేయాలని తన్నీరు నాగేశ్వరరావు సూచించారు. గ్రామస్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేయడంతో పాటు ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకుని, వారి తరఫున పోరాడాలని కోరారు. కూటమి ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. కూటమి పాలనపై ప్రజల్లో వ్యతిరేకత ప్రారంభమైందని పేర్కొంటూ, రాబోయే రోజుల్లో వైఎస్సార్‌సీపీ మరింత బలమైన రాజకీయ శక్తిగా ఎదుగుతుందని కార్యకర్తలకు భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో గ్రామ వైఎస్సార్‌సీపీ వివిధ హోదాల్లో ఉన్న నాయకులు, కార్యకర్తలు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.