కూటమి హామీలన్నీ నీటి మూటలే.. ప్రజలకు వాస్తవాలు వివరించాలి. స్థానిక ఎన్నికలకు పార్టీ శ్రేణులు సిద్ధం కావాలి: తన్నీరు నాగేశ్వరరావు పార్టీ కార్యకర్తలకు ఐడీ కార్డుల పంపిణీ
కూటమి హామీలన్నీ నీటి మూటలే.. ప్రజలకు వాస్తవాలు వివరించాలి.
స్థానిక ఎన్నికలకు పార్టీ శ్రేణులు సిద్ధం కావాలి: తన్నీరు నాగేశ్వరరావు
పార్టీ కార్యకర్తలకు ఐడీ కార్డుల పంపిణీ
నందిగామ మేజర్ న్యూస్ ప్రతినిధి (ప్రశాంత్ )అక్టోబర్ 4
నందిగామ మండలం రామిరెడ్డిపల్లి గ్రామంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి జగ్గయ్యపేట నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ ఇన్‌ఛార్జ్ తన్నీరు నాగేశ్వరరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా పార్టీ కార్యకర్తలకు వైఎస్సార్‌సీపీ ఐడీ కార్డులను తన్నీరు నాగేశ్వరరావు పంపిణీ చేశారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని పార్టీ సంస్థాగత బలోపేతం, క్షేత్రస్థాయి కార్యాచరణపై పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు.కూటమి ప్రభుత్వం చేపడుతున్న డిజిటల్ రాజకీయాలను సోషల్ మీడియా వేదికగా సమర్థవంతంగా తిప్పికొట్టాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో అమలు చేసిన సంక్షేమ పథకాలు, చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించడంతో పాటు, ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు.ఎన్నికల సమయంలో కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తిస్థాయిలో అమలు చేయలేదని తన్నీరు నాగేశ్వరరావు విమర్శించారు. ఇచ్చిన హామీలు అమలుకు నోచుకోకపోవడంతో ప్రజలు నిరాశకు గురవుతున్నారని అన్నారు.నిత్యావసర వస్తువుల ధరలు పెరగడంతో సామాన్య, మధ్యతరగతి కుటుంబాలపై ఆర్థిక భారం పెరిగిందన్నారు. ప్రభుత్వ వైఫల్యాలు, ప్రజలపై పడుతున్న భారాలు, సంక్షేమ పథకాల అమలులో ఉన్న లోపాలను క్షేత్రస్థాయిలో ప్రజలకు వివరించాలని పార్టీ శ్రేణులకు సూచించారు.ప్రతి కార్యకర్త సైనికుడిలా పనిచేస్తూ పార్టీ బలోపేతానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. ప్రజా సమస్యలపై రాజీలేని పోరాటాలు నిర్వహిస్తూ ప్రజలకు అండగా నిలవాలని అన్నారు.రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల విజయమే లక్ష్యంగా ప్రతి నాయకుడు, కార్యకర్త సమన్వయంతో పనిచేయాలని, పార్టీ విజయానికి ఇప్పటి నుంచే పటిష్టమైన కార్యాచరణతో ముందుకు సాగాలని తన్నీరు నాగేశ్వరరావు పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు రేఖ శ్రీనివాసరావు, గ్రామ పార్టీ అధ్యక్షులు పోపూరి పూర్ణచంద్రరావు, జిల్లా ప్రధాన కార్యదర్శి చల్లా వైకుంఠ రావు, జిల్లా రైతు విభాగ కార్యదర్శి దేవినేని రామారావు, నాయకులు పోపూరి కిషోర్, నల్లపు ఆదాం, వీరమాచినేని నాగమల్లేశ్వరరావు, షేక్ సైదా సాహెబ్, వీరమాచినేని కృష్ణ, కాకర్ల రాంబాబు మాజీ సర్పంచ్ పల్లె కంటి అరుణకుమారి, మాజీ మండల పార్టీ అధ్యక్షుడు దేవినేని నాగేశ్వరరావు, నల్లపు ప్రకాష్, జెండా వెంకట కృష్ణ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు మహిళలు తదితరులు పాల్గొన్నారు.