త్రిమూర్తుల పుణ్యక్షేత్రంలో 21 రోజుల పూజల అనంతరం వినాయకుడి నిమజ్జనం
నారాయణపేట, సూర్యన్యూస్ :
నారాయణపేట మండలం పేరపళ్ళ గ్రామ త్రిమూర్తుల పుణ్యక్షేత్రంలో వినాయక చవితి పర్వదినం ప్రతిష్టించిన గణనాథుడికి 21రోజుల పాటు భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించారు. ప్రతిరోజూ ఆలయ మండపంలో ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేపట్టి భక్తులకు ప్రసాద వితరణ చేశారు. చివరిరోజు ఆదివారం సైతం వినాయక విగ్రహంతో పాటు ఆలయంలో కొలువైన కాళీమాత, కాలభైరవ స్వామి, లక్ష్మీనరసింహ స్వామి, విఘ్నేశ్వర స్వామి, ఎల్లమ్మతల్లి, వారాహి దేవతలకు రుద్ర గురూజీ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు చేసి వినాయకుడి శాలువని వేలంపాట నిర్వహించారు. మెస్త్రి కిషన్ నాయక్ రూ.1,001,00లకు శాలువాను దక్కించుకున్నారు. ఈ కార్యక్రమంలో అత్యధిక భక్తులు, స్వాములు, ఆలయ నిర్వాహకులు, సేవకులు స్థానికులు భక్తజన బృందం పరిసర ప్రాంతాల భక్తులు పాల్గొన్నారు. అనంతరం లంబోదరుడిని జల ప్రవేశం చేయించారు.
-- *రాజేష్ కుమార్, సూర్య రిపోర్టర్ నారాయణపేట*