BREAKING
ఓటీటీకి వచ్చేసిన మలయాళ సెన్సేషనల్ క్రైమ్ థ్రిల్లర్... బాక్సాఫీస్ వద్ద రూ.50 కోట్లు వసూలు చేసిన సినిమా స్ట్రీమింగ్ ఎప్పుడంటే కూటమి హామీలన్నీ నీటి మూటలే.. ప్రజలకు వాస్తవాలు వివరించాలి. స్థానిక ఎన్నికలకు పార్టీ శ్రేణులు సిద్ధం కావాలి: తన్నీరు నాగేశ్వరరావు పార్టీ కార్యకర్తలకు ఐడీ కార్డుల పంపిణీ దేవర చుట్టమల్లే ఏఐ మార్ఫింగ్ వీడియోపై కుష్బూ సుందర్ తీవ్ర ఆగ్రహం.. మహిళల గౌరవం ఆటవస్తువు కాదంటూ ఘాటు వ్యాఖ్యలు ఎన్నికల సంఘం స్వతంత్ర తను కాపాడా లి ఎస్ ఐ ఆర్ ప్రక్రియ ను నిలిపివేయాలి... సీపీఐ - సిపిఎం… ఎన్నికల సంఘం స్వతంత్రతను కాపాడాలి నేడు గార్లకు రానున్న ఎమ్మెల్యే కోరం కనకయ్య కార్నెల్ విశ్వవిద్యాలయ సామూహిక అత్యాచార బాధితురాలికి బెదిరింపులు రెడ్‌క్రాస్‌ జిల్లా చైర్మన్‌గా డాక్టర్‌ ఎస్‌.ఎం. రాజేశ్వర్‌రావు స్థానిక ఎన్నికలకు వైఎస్సార్‌సీపీ సన్నద్ధం పెనుగంచిప్రోలులో పార్టీ శ్రేణులకు సభ్యత్వ కార్డుల పంపిణీ ఏఐ మార్ఫింగ్ వీడియోలపై జాన్వీ కపూర్ ఆవేదన: అనుమతి లేకుండా మహిళల చిత్రాలతో కల్పిత కంటెంట్ లైంగిక దాడికి సమానమని వ్యాఖ్య, ఎన్టీఆర్, చిరంజీవికి కృతజ్ఞతలు రాంపల్లి మరో జవహర్‌నగర్‌గా మారొద్దు.. ! సెంట్రల్ అమెరికన్ పార్లమెంట్ నుంచి తప్పుకుంటున్నట్లు నికరాగ్వా సంచలన ప్రకటన బీసీల హక్కుల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోంది... నాగండ్లలో నేత్రదానం కుమ్మరి సంఘ భవన నిర్మాణానికి సంపూర్ణ సహకారం అందజేస్తాము* నాగండ్ల లో నేత్రదానం

భవిష్యత్ అవసరాల దూరదృష్టితోనే కొత్త రహదారుల నిర్మాణం మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి

Select Suryaa Now
భవిష్యత్ అవసరాల దూరదృష్టితోనే కొత్త రహదారుల నిర్మాణం  మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి

కేంద్ర–రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతోనే అభివృద్ధి సాధ్యం
ఎక్తానగర్ చేరుకున్న మంత్రికి గుజరాత్  సాంప్రదాయం ప్రకారం ఘన స్వాగతం

తెలంగాణ బ్యూరో, ప్రతినిధి:
చింతన్ శివిర్‌- 2026 కు హాజరయ్యేందుకు గుజరాత్ చేరుకున్న సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి స్థానిక మీడియాతో మాట్లాడుతూ దేశంలో రహదారుల అభివృద్ధికి కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారని అన్నారు. భవిష్యత్ అవసరాల దూరదృష్టితోనే జాతీయ రహదారుల నిర్మాణం వేగంగా జరుగుతోందని చెప్పారు. హామ్  ప్రాజెక్టులు కూడా దేశవ్యాప్తంగా రహదారుల అభివృద్ధిలో కీలకంగా మారాయని మంత్రి పేర్కొన్నారు. గడ్కరీ నాయకత్వంలో రహదారుల రంగంలో పర్వతమాల, రోప్‌వేలు వంటి అనేక కొత్త కార్యక్రమాలు ముందుకు వస్తున్నాయని, వాటి ద్వారా దేశంలోని మౌలిక వసతులు మరింత బలోపేతం అవుతున్నాయని తెలిపారు.మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానం ఇస్తూ
రాజకీయాలకు అతీతంగా కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ రాష్ట్రాల అభివృద్ధికి సహకరిస్తున్నారని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ప్రశంసించారు. కాంగ్రెస్, బీజేపీ లేదా ప్రాంతీయ పార్టీ ఏ ప్రభుత్వం ఉన్నా అన్ని రాష్ట్రాలను సమానంగా చూస్తూ, అభివృద్ధి పనులకు ప్రాధాన్యత ఇస్తున్నారని చెప్పారు. తాము కేంద్రాన్ని కోరిన పలు రహదారి ప్రాజెక్టులను కూడా ఆయన సానుకూలంగా పరిశీలించి మంజూరు చేస్తున్నారని మంత్రి తెలిపారు. అందుకే దేశవ్యాప్తంగా రహదారుల అభివృద్ధి వేగంగా సాగుతోందని అన్నారు. దేశంలో భారీ మౌలిక వసతుల ప్రాజెక్టులు విజయవంతంగా పూర్తి కావాలంటే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమన్వయం అత్యంత కీలకమని, చింతన్ శివిర్ ప్రధాన ఉద్దేశమని మంత్రి పేర్కొన్నారు. రాష్ట్ర అవసరాలను కేంద్రం దృష్టికి తీసుకెళ్లడంతో పాటు, కేంద్రం చేపడుతున్న కొత్త విధానాలు, పథకాలను రాష్ట్రంలో సమర్థవంతంగా అమలు చేయడానికి ఈ సమావేశం ఉపయోగపడుతుందని తెలిపారు.
తెలంగాణ భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా రహదారి మౌలిక వసతులను అభివృద్ధి చేయడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని, ఇందుకోసం కేంద్రంతో సమన్వయం చేసుకుంటూ రాష్ట్రానికి అవసరమైన అన్ని కీలక ప్రాజెక్టులను సాధించేందుకు కృషి చేస్తామని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి స్పష్టం చేశారు.