నారాయణపేట జిల్లా గెజిటెడ్ ప్రధానోపాధ్యాయుల నూతన కార్యవర్గం ఎన్నిక
నారాయణపేట, సూర్యన్యూస్ :
గెజిటెడ్ ప్రధానోపాధ్యాయుల నారాయణపేట జిల్లా నూతన కార్యవర్గాన్ని ఆదివారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మహబూబ్ నగర్ పట్టణంలోని ప్రభుత్వ బీఈడీ కళాశాల ఆవరణలో సమావేశమై నూతన అధ్యక్షులుగా రాగిరి ఆంజనేయులు (జడ్పీ హై స్కూల్ - నిడ్జింత), ప్రధాన కార్యదర్శిగా గుండ్రాతి గోవర్ధన్ గౌడ్ (జడ్పీ హై స్కూల్ - పెద్ద చింతకుంట), కోశాధికారిగా బాదేపల్లి వెంకటయ్య గౌడ్ (జడ్పీ హై స్కూల్ - కర్ణి), గౌరవ అధ్యక్షులుగా జనార్దన్ రెడ్డి (జడ్పీ హై స్కూల్ - మీర్జాపూర్), రాష్ట్ర కౌన్సిల్ సభ్యులుగా నిజాముద్దీన్ (జడ్పీ హై స్కూల్ - మూడుమాల్), కిషోర్ కుమార్ (జడ్పీ హై స్కూల్ - కృష్ణ), మహిళా అధ్యక్షురాలిగా కుసుమ (జడ్పీ హై స్కూల్ - ఉట్కూర్), గౌరమ్మ (జడ్పీ హై స్కూల్ - పెద్దజెట్రం), భాగ్యలక్ష్మి (జడ్పీ హై స్కూల్ - పెద్ద కడుమూర్), జిల్లా అసోసియేట్ అధ్యక్షులుగా రాంరెడ్డి (జడ్పీ హై స్కూల్ - ఉండేకొడ్), రఘుమోహన్ (జడ్పీ హై స్కూల్ - కిస్టాపూర్), మీర్జా ఖలీముల్లా (జడ్పీ హై స్కూల్ ఉర్దూ - మరికల్), కార్యదర్శులుగా చంద్రకళ (జడ్పీ హై స్కూల్ - జక్లేర్), నీలిమ (జడ్పీ హై స్కూల్ - భూనీద్), వినోదాకుమారి (జడ్పీ హై స్కూల్ - భోగారం) ఆర్గనైజింగ్ సెక్రటరీలుగా శంకర్ నాయక్ (ప్రభుత్వ హై స్కూల్ బాలికలు - కోస్గి), సురేష్ (జడ్పీ హై స్కూల్ - దామరగిద్ద), హెడ్ క్వార్టర్ సెక్రటరీ గా ఈ. బాలాజీ (జడ్పీ హై స్కూల్ - బొమ్మనుపాడు)లు ఏకగ్రీవంగా ఎన్నిక కాబడ్డారు. కాగా ఎన్నికల అధికారులుగా రాష్ట్ర బాధ్యులు గిరిధర్ గౌడ్, కృష్ణలు వ్యవహారించారు.
*51 శాతం ఫిట్మెంతో పిఆర్సి ప్రకటించాలి*
నూతన కమిటీ ఎన్నిక తర్వాత కొత్త సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా వారిని శాలువాతో సన్మానించి మిఠాయిలు తినిపిస్తూ తోటి ఉపాధ్యాయులు అభినందించారు. అనంతరం నూతన సభ్యులు మాట్లాడుతూ.. ఎంతో నమ్మకం ఉంచి తమకు కమిటీలో స్థానం కల్పించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. గెజిటెడ్ ప్రధానోపాధ్యాయుల సమస్యల సాధనకు తమ వంతుగా కృషి చేస్తామని చెప్పారు. ఎన్నో రోజులుగా పెండింగ్లో ఉన్న పిఆర్సి ని ప్రభుత్వం వెంటనే ప్రకటించి 51 శాతం ఫిట్మెంట్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఉమ్మడి సర్వీస్ రూల్స్ ను అమలు పర్చి పర్యవేక్షణ అధికారుల పోస్టులు ఎంఈఓ, డిప్యూటీ ఈవోలను భర్తీ చేయాలని, డైట్ లెక్చరర్ ప్రమోషన్లు చేపట్టాలని కోరారు. అదేవిధంగా జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి ఖాళీల స్థానంలో అకాడమిక్ ఇన్స్ట్రక్టర్ లు, ప్రతి కాంప్లెక్స్ కి కంప్యూటర్ ఆపరేటర్ లను, ప్రిప్రైమరీ లో ఆయాలను నియమించాలని కోరారు.
-- *రాజేష్ కుమార్, సూర్య ఎడ్యుకేషన్ రిపోర్టర్ నారాయణపేట*