రాష్ట్రస్థాయి బ్యాడ్మింటన్ పోటీలకు ఆర్షిత రేచల్ ఎంపిక
రాష్ట్రస్థాయి బ్యాడ్మింటన్ పోటీలకు ఆర్షిత రేచల్ ఎంపిక
ఎమ్మిగనూరు, సూర్య ప్రతినిధి
స్కూల్ గేమ్స్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన అనంతపురం జిల్లా స్థాయి అండర్-14 బ్యాడ్మింటన్ పోటీల్లో కర్నూలు జిల్లా నందవరం మండలం మిట్ట సోమాపురం గ్రామానికి చెందిన ఆర్షిత రేచల్ ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైంది.
ఆర్షిత రేచల్ తండ్రి డాక్టర్ ఎర్రన్న జూనియర్ కళాశాలలో లెక్చరర్‌గా, తల్లి కె.ఆర్. శ్రీదేవి ఎంపీపీ ఎస్ పాఠశాల ప్రధానోపాధ్యాయురాలిగా విధులు నిర్వహిస్తున్నారు. తమ మనవరాలు రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక కావడంతో అవ్వ, తాతలు హరిజన సోమక్క, లక్ష్మన్నతో పాటు బంధువులు, గ్రామస్థులు హర్షం వ్యక్తం చేశారు.మారుమూల గ్రామంలో అయిన మిట్టసోమాపురం అనే
చిన్న గ్రామం నుంచి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైన ఆర్షిత రేచల్‌ను గ్రామ ప్రజలు అభినందించి, భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆశీర్వదించారు.