BREAKING
నేచురల్ స్టార్ నాని బ్లడీ రోమియో సినిమా హీరోయిన్ ఫిక్స్, సుజీత్ దర్శకత్వంలో క్రేజీ ప్రాజెక్ట్ బిజెపి మండల నూతన కార్యవర్గ సభ్యుల ఎంపిక ఎకగ్రీవం తపాలా లక్ష్మీ నరసింహస్వామి దేవాలయ నూతన కమిటీ ఎన్నిక ఉత్తర కొరియాతో జెట్ డ్రోన్ టెక్నాలజీని పంచుకున్న రష్యా వన్యప్రాణుల పరిరక్షణకు పరుగులు రియాద్ వేదికగా రేపు మక్కా ఒప్పంద కమిటీ సమావేశం భోజనం చేసిన తర్వాత ఛాతీలో మంట ఎందుకు వస్తుంది, కారణాలు మరియు నివారణ మార్గాలు గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరిచే అద్భుతమైన పండు దానిమ్మ, శాస్త్రవేత్తల సరికొత్త పరిశోధన పట్టభద్రుల తీర్పు.. యువత భవిష్యత్తుకు మలుపు:డా. చినుకని శివ ప్రసాద్ జ్వరం వచ్చినప్పుడు చికెన్ తినవచ్చా, వైద్యులు ఏం చెబుతున్నారు మరియు ఎలాంటి ఆహారం తీసుకోవాలి ఎమ్మెల్యే పరిటాల సునీతమ్మను కలిసిన నసనకోట ఎం జె పి విద్యా కమిటీ చైర్మన్ సౌజన్య నాగండ్ల నేత్రదానం తొలి సినిమాపై శ్రుతి హాసన్ ఆసక్తికర వ్యాఖ్యలు, నాన్న కోసమే ఆ నటన అంటున్న నటి ఎమ్మెల్యే పరిటాల సునీతమ్మను కలసి సన్మానించిన నసనకోట ఎం జె పి విద్యా కమిటీ చైర్మన్ సౌజన్య ఎస్‌ఎస్‌ రాజమౌళి వారణాసి సినిమా షూటింగ్ అప్‌‌డేట్, రికార్డు వేగంతో జక్కన్న ప్రాజెక్ట్

మంగళవారం జాబ్ మేళా

Select Suryaa Now
మంగళవారం జాబ్ మేళా
  • డిప్లమో ఐటిఐ విద్యార్థులకు ఉద్యోగ అవకాశం
  • జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్

శ్రీకాకుళం: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న 'స్వర్ణ గ్రామం - స్వర్ణ వార్డు'లలో భాగమైన 'కౌశలం' ద్వారా నిర్వహిస్తున్న ఉద్యోగ మేళాను జిల్లాలోని నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ పిలుపునిచ్చారు. ఈ నెల 6వ తేదీ (మంగళవారం) శ్రీకాకుళం పట్టణంలోని జిల్లా ప్రజా పరిషత్ సమావేశ మందిరంలో ఉదయం 9:00 గంటల నుంచి ఈ నియామకాల ప్రక్రియ ప్రారంభమవుతుందని ఆదివారం విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలియజేశారు. ప్రముఖ ప్రీమియర్ ఎనర్జీ గ్లోబల్ ప్రైవేట్ లిమిటెడ్ " సంస్థ ప్రతినిధులు హాజరై అప్రెంటిసిస్ కొరకు అర్హులైన అభ్యర్థులను ఎంపిక చేస్తారని, వార్షిక వేతనం రూ. 1,64,806 నుంచి రూ. 4,00,000 వరకు ఉంటుందని స్పష్టం చేశారు.
అర్హత కలిగిన డిప్లొమా కోర్సులు (మెకానికల్ ఇంజినీరింగ్ , ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ , కంప్యూటర్ సైన్స్ ,ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్ ఇంజినీరింగ్) , ఐ టి ఐ ట్రేడ్స్ (ఎలక్ట్రీషియన్ , ఫిట్టర్ , ఎలక్ట్రానిక్స్ ,మెకానిక్, ఇన్‌స్ట్రుమెంట్ మెకానిక్ , మెకానిక్ ఇండస్ట్రియల్ ఎలక్ట్రానిక్స్ , టర్నర్ , మెషినిస్ట్ , వెల్డర్ , డీజిల్ మెకానిక్ , మెయింటెనెన్స్ మెకానిక్) ట్రేడ్లు కలిగిన వారు అర్హులని తెలిపారు.
ఎటువంటి పూర్వ అనుభవం లేని వారు కూడా నియామక ప్రక్రియలో పాల్గొనవచ్చని పేర్కొన్నారు.ఎంపికైన అభ్యర్థులు తిరుపతి సమీపమున గల సదరు సంస్థలో పనిచేయవలసి ఉంటుంది. వేతనంతో పాటు లోకల్ ట్రాన్స్‌పోర్ట్ సదుపాయం  కల్పిస్తారని వెల్లడించారు.