BREAKING
ఓటీటీకి వచ్చేసిన మలయాళ సెన్సేషనల్ క్రైమ్ థ్రిల్లర్... బాక్సాఫీస్ వద్ద రూ.50 కోట్లు వసూలు చేసిన సినిమా స్ట్రీమింగ్ ఎప్పుడంటే కూటమి హామీలన్నీ నీటి మూటలే.. ప్రజలకు వాస్తవాలు వివరించాలి. స్థానిక ఎన్నికలకు పార్టీ శ్రేణులు సిద్ధం కావాలి: తన్నీరు నాగేశ్వరరావు పార్టీ కార్యకర్తలకు ఐడీ కార్డుల పంపిణీ దేవర చుట్టమల్లే ఏఐ మార్ఫింగ్ వీడియోపై కుష్బూ సుందర్ తీవ్ర ఆగ్రహం.. మహిళల గౌరవం ఆటవస్తువు కాదంటూ ఘాటు వ్యాఖ్యలు ఎన్నికల సంఘం స్వతంత్ర తను కాపాడా లి ఎస్ ఐ ఆర్ ప్రక్రియ ను నిలిపివేయాలి... సీపీఐ - సిపిఎం… ఎన్నికల సంఘం స్వతంత్రతను కాపాడాలి నేడు గార్లకు రానున్న ఎమ్మెల్యే కోరం కనకయ్య కార్నెల్ విశ్వవిద్యాలయ సామూహిక అత్యాచార బాధితురాలికి బెదిరింపులు రెడ్‌క్రాస్‌ జిల్లా చైర్మన్‌గా డాక్టర్‌ ఎస్‌.ఎం. రాజేశ్వర్‌రావు స్థానిక ఎన్నికలకు వైఎస్సార్‌సీపీ సన్నద్ధం పెనుగంచిప్రోలులో పార్టీ శ్రేణులకు సభ్యత్వ కార్డుల పంపిణీ ఏఐ మార్ఫింగ్ వీడియోలపై జాన్వీ కపూర్ ఆవేదన: అనుమతి లేకుండా మహిళల చిత్రాలతో కల్పిత కంటెంట్ లైంగిక దాడికి సమానమని వ్యాఖ్య, ఎన్టీఆర్, చిరంజీవికి కృతజ్ఞతలు రాంపల్లి మరో జవహర్‌నగర్‌గా మారొద్దు.. ! సెంట్రల్ అమెరికన్ పార్లమెంట్ నుంచి తప్పుకుంటున్నట్లు నికరాగ్వా సంచలన ప్రకటన బీసీల హక్కుల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోంది... నాగండ్లలో నేత్రదానం కుమ్మరి సంఘ భవన నిర్మాణానికి సంపూర్ణ సహకారం అందజేస్తాము* నాగండ్ల లో నేత్రదానం

ఆత్మకూరులో కెవిపి ఎస్ జెండా ఆవిష్కరణ

Select Suryaa Now
ఆత్మకూరులో కెవిపి ఎస్ జెండా ఆవిష్కరణ

ఆత్మకూరు లో కెవిపిఎస్ జెండా ఆవిష్కరణ
--అట్రాసిటీస్ చట్టాన్ని కఠినంగా అమలు చేయాలని డిమాండ్
ఆత్మకూరు, మేజర్ న్యూస్, సోమ వెంకటసుబ్బయ్  :

కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం 28వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆత్మకూరు పట్టణం మున్సిపల్ బస్టాండ్ ప్రాంతంలో ఆదివారం జండా ఆవిష్కరణ చేయడం జరిగినది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కెవిపిఎస్ నాయకులు  మాట్లాడుతూ ఆత్మగౌరవం సమానత్వం కుల నిర్మూలన ఆశ యాలుగా కెవిపిఎస్ పని చేస్తున్నదని,  స్వతంత్రం వచ్చి 80 సంవత్సరములు దాటినా ఇప్పటికీ దళితులకు దేవాలయ ప్రవేశం లేకపోవడం, అరుగుల మీద కూర్చోనీయకపోవడం జరుగుతున్నదన్నారు. తమ సంఘం పోరాట ఫలితం గానే జస్టిస్ పున్నయ్య  కమిటీ సిఫార్సులు సాధించగలిగామని, అయితే ప్రభుత్వాలు అట్రాసిటీస్ చట్టాన్ని సక్రమంగా అమలు చేయక పోవడంతో దాడులు పునరావృతం అవుతున్నాయని అన్నారు. దళిత కాలనీల అభివృద్ధి కోసం సబ్ ప్లాన్ నిధులను సక్రమంగా ఖర్చు చేయక పోవడంతో దళిత కాలనీలు అభివృద్ధి జరగడంలేదని, దళితుల స్మశానాల కోసం అభివృద్ధి కోసం వచ్చిన 1235 జీవోను అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ డిమాండ్స్ సాధనకై ఈనెల 6వ తేదీ విజయవాడలో జరుగుతున్న మహా ధర్మాను జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో కెవిపిఎస్ జిల్లా నాయకులు ఆత్మకూరు నాగయ్య, సిపిఎం పార్టీ పట్టణ కార్యదర్శి డేవిడ్ రాజు, టౌన్ కమిటీ సభ్యులు నాగేంద్ర, కెవిపిఎస్ జిల్లా కమిటీ సభ్యులు జి.పెంచలయ్య, రాము, రవుఫ్, ఆటో యూనియన్ నాయకులు ఆళ్ల పెంచలయ్య తదితరులు పాల్గొన్నారు.