రేపు కలెక్టరేట్ లో పి.జి.ఆర్.ఎస్, రెవెన్యూ క్లినిక్
ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (పి జి ఆర్ ఎస్), రెవిన్యూ క్లినిక్ ల కార్యక్రమాలను నేడు అక్టోబర్ 05 సోమవారం ఉదయం 10 గంటలకు కలెక్టరేట్ సమావేశ మందిరంతో పాటు జిల్లాలో అన్ని మండల, డివిజన్ స్థాయి కార్యాలయాలలో నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ విజయ క్రిష్ణన్ ఆదివారం ఆ ప్రకటనలో పేర్కొన్నారు. పి.జి.ఆర్.ఎస్, రెవెన్యూ క్లినిక్ లలో సమర్పించిన అర్జీల సమాచారం కోసం 1100 టోల్ ఫ్రీ నెంబర్ కు నేరుగా కాల్ చేసి తెలుసుకోవాలని అర్జీదారులకు కలెక్టర్ సూచించారు.పి జి ఆర్ ఎస్, రెవిన్యూ క్లినిక్ లకు హాజరు కాని అర్జీదారులు (మీ కోసం డాట్ ఏపీ డాట్ జివో వి డాట్ ఇన్) వెబ్సైట్ ద్వారా అర్జీలు నమోదు చేసుకోవచ్చని జిల్లా కలెక్టర్ విజయ క్రిష్ణన్ పేర్కొన్నారు.