సమాజాభివృద్ధికి కృషి చేయాలి.
దర్శి మేజర్ న్యూస్. సమాజంలో నీ తోటి వారికి సహాయపడుతూ అభివృద్ధికి కృషి చేయాలని లయన్స్ క్లబ్ గవర్నర్ రావిపాటి లక్ష్మీనారాయణ కోరారు.లయన్స్ క్లబ్ ఆఫ్ దర్శి స్నేహా ఆధ్వర్యంలో స్ధానిక పి జి యన్ తాలూకా క్లబ్ నందు 3 వ నూతన కార్యవర్గ ప్రమాణస్వీకార మహోత్సము జరిగినది. నూతన అధ్యక్ష కార్యదర్శులుగా పానుగంటి సత్యనారాయణ గుప్తా , బిజ్జం నాగార్జున రెడ్డి , గుడిపాటి. అశోక్ లు ప్రమాణ స్వీకారం చేశారు ఈ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవానికి ముఖ్యఅతిథిగా జిల్లా గవర్నర్ లయన్ రావిపాటి. లక్ష్మీ నారాయణ , ఇన్స్టాలేషన్ ఆఫీసర్ గా పాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్ లయన్ పి విజయ కుమార్ రెడ్డి , న్యూ మెంబర్ ఇండక్షన్ ఆఫీసర్ గా పాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్ లయన్ నామినేని మోహన్ రావు , జిల్లా క్యాబినెట్ సెక్రటరీ చలువాది. శ్రీహరి , జిల్లా మెంటర్ లయన్ డాక్టర్ బి. జవహర్ , జి ఈ టి కోఆర్డినేటర్ ముత్యాల ప్రసాదు , రీజియన్ చైర్మన్ కల్లూరి విద్యాసాగర్ రెడ్డి , జోన్ చైర్మన్ 1 నూనె. హేమసుందర్ రావు , జోన్ చైర్మన్ 2 టి వి రామకృష్ణ రావు, రీజియన్ సెక్రటరీ బూదాటి ఆంజనేయులు , డిస్ట్రిక్ట్ చైర్మన్ తమ్మవరపు ఫణి బాబు ,క్లబ్ సభ్యులు గన్నమనేని శ్రీనివాస రావు ,గువ్వల. శ్రీనివాస రెడ్డి , యెనుముల నరసారెడ్డి, అంబటి గోవిందరెడ్డి , గుడిపల్లి శ్రీధర రావు మేడగం రాజ శేఖర్ రెడ్డి , సిరిచాపల. ఖాసిం సాహెబ్ , ధనిరెడ్డి వెంకట రెడ్డి ,నూతన సభ్యులు గుణ్ణం సుబ్బారెడ్డి , డాక్టర్ నాగజ్యోతి , దేవతి అవినాష్ , సురే వెంకటేశ్వర్లు , అరెకొండా. మల్లికార్జునరావు కలాం.భాస్కర్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ నూతన కార్యవర్గ ప్రమాణస్వీకారం సందర్భంగా ముగ్గురు నిరుపేద మహిళలకు ₹12000 రూపాయలు విలువ గల నిత్యవసర సరుకులు పంపిణీ చేశారు.