BREAKING
శింగనమలలో రేపు మంత్రి పయ్యావుల కేశవ్ పర్యటన... పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొననున్న రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి... రేపు కలెక్టరేట్ లో పి.జి.ఆర్.ఎస్, రెవెన్యూ క్లినిక్ ఆపరేషన్ త్రిశూల్‌లో భాగంగా వత్సవాయిలో విస్తృత వాహన తనిఖీలు ఘనవిజయమే లక్ష్యంగా ఆత్మకూరు మున్సిపల్ ఎన్నికలపై ఎన్ డి ఏ కూటమి కీలక భేటీ పాకిస్థాన్ హనీట్రాప్ ఉచ్చులో భారత నావికాదళ సెయిలర్ రాష్ట్రస్థాయి బ్యాడ్మింటన్ పోటీలకు ఆర్షిత రేచల్ ఎంపిక 2030 నాటికి భారతీయ పర్యాటకుల బసను రెట్టింపు చేయడమే లక్ష్యం: జర్మనీ పర్యాటక బోర్డు కీలక ప్రకటన తీరంలో పుట్టగొడుగుల్లా దుకాణాలు* నగర అభివృద్ధికి పునాదులు వేసిన మహానుభావుడు స్వర్గీయ మాజీ శాసనసభ్యులు పునుగుపాటి రూ.54 లక్షల రైస్‌మిల్లు బిల్లులపై రగడ యుద్ధ విమానాల కొరతపై వైమానిక దళ చీఫ్ ఆందోళన సమాజాభివృద్ధికి కృషి చేయాలి. సాగునీటి ప్రాజెక్టులపై సమీక్షా సమావేశం $10.5 బిలియన్ల విమానాల కాంట్రాక్ట్ దక్కితే భారత్‌లో భారీగా తయారీ విస్తరణ : లాక్‌హీడ్ మార్టిన్ కీలక ప్రకటన వైసీపీ హయాంలో ప్రాజెక్టులకు బ్రేకులు..కూటమి పాలనలో పరుగులు

2021 ఫలితాలు పునరావృతం కావాలి.

Select Suryaa Now
2021 ఫలితాలు పునరావృతం కావాలి.
  •  స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్ని స్థానాలు కైవసం చేసుకోవాలి: ధర్మాన కృష్ణదాస్..

నరసన్నపేట: రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో నరసన్నపేట మండలంలోని అన్ని స్థానాలను వైఎస్సార్ సీపీ కైవసం చేసుకునేలా పార్టీ శ్రేణులు ఐక్యంగా పనిచేయాలని మాజీ ఉప ముఖ్యమంత్రి, వైఎస్సార్ సీపీ నాయకుడు ధర్మాన కృష్ణదాస్ పిలుపునిచ్చారు. 2021లో సాధించిన విజయాలను మరోసారి పునరావృతం చేసే దిశగా ప్రతి కార్యకర్త సమన్వయంతో పనిచేయాలని సూచించారు.

నరసన్నపేట పట్టణంలోని ఆహా ఫంక్షన్ హాల్‌లో ఆదివారం నిర్వహించిన వైఎస్సార్ సీపీ మండల విస్తృతస్థాయి సమావేశానికి ధర్మాన కృష్ణదాస్‌తో పాటు ధర్మాన రామదాస్, యువ నాయకుడు డాక్టర్ ధర్మాన కృష్ణచైతన్య హాజరయ్యారు. ఈ సందర్భంగా కృష్ణదాస్ మాట్లాడుతూ పార్టీ శ్రేణులు క్షేత్రస్థాయిలో ప్రజలతో మమేకమై పనిచేయాలని కోరారు. ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న ప్రభుత్వానికి ఎన్నికల్లో ప్రజలు తగిన సమాధానం చెప్పేలా పార్టీ కార్యకర్తలు పనిచేయాలని పిలుపునిచ్చారు.

డాక్టర్ ధర్మాన కృష్ణచైతన్య మాట్లాడుతూ పార్టీ కోసం కష్టపడుతున్న కార్యకర్తలకు గుర్తింపు కల్పించేందుకు ఐడీ కార్డులు అందిస్తున్నట్లు తెలిపారు. పార్టీ ఐడీ కార్డు పొందిన కార్యకర్తలకు రూ.5 లక్షల ప్రమాద బీమా సదుపాయం కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. కార్యకర్తలకు పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.

సాక్షి ఛానల్ ప్రసారాలను నిలిపివేయడంపై ఆయన ప్రస్తావిస్తూ, పార్టీ నాయకులు, కార్యకర్తలు సోషల్ మీడియాను మరింత సమర్థవంతంగా వినియోగించాలని సూచించారు. పార్టీ కార్యక్రమాలు, విధానాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లేందుకు ప్రతి కార్యకర్త సోషల్ మీడియా వేదికగా చురుకైన పాత్ర పోషించాలని కోరారు.

అనంతరం నాయకులు, కార్యకర్తలకు పార్టీ ఐడీ కార్డులను పంపిణీ చేశారు. పదవీకాలం పూర్తిచేసుకున్న మాజీ జెడ్పీటీసీలు, మాజీ ఎంపీటీసీలను శాలువాలతో సత్కరించి అభినందించారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ నాయకులు, ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, అనుబంధ విభాగాల నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.