BREAKING
శాంతిభద్రతల పరిరక్షణే పోలీసుల ధ్యేయం.. ఎస్పీ రాహుల్ మీనా.. మున్సిపల్ ఎన్నికల్లో బ్రాహ్మణులకు ప్రాతినిధ్యం కల్పించాలి..:బ్రాహ్మణ పెద్దల సమావేశంలో ఏకగ్రీవ తీర్మానం.. రైల్వే ట్రాక్ మార్గాన్ని పునఃపరిశీలించండి..:ఎమ్మెల్యే ఆనందరావుకు చాంబర్ ఆఫ్ కామర్స్ వినతి.. ముమ్మిడివరంలో 24వ రోజుకు చేరిన వీఆర్ఏల సమ్మె: స్పందించని ప్రభుత్వం.. మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ ఆధ్వరంలో జాతీయ బాలిక దినోత్సవ వేడుకలు. దివంగత నేత జక్కంపూడి రామ్మోహనరావు వర్ధంతి 52 మంది లబ్ధిదారులకు హౌసింగ్ లోన్ మంజూరు.... ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు. లయన్స్ ఆధ్వర్యంలో పాత కళ్లజోళ్ల సేకరణ,: జిల్లా గవర్నర్ లయన్ చిట్నీడి శ్రీనివాసు పిలుపు! యువత స్వామి వివేకానందవారిని అదర్శముగా తీసుకోవాలి.. ఎం పి గంటి హరీష్ మాధుర్, ప్రపంచ టాప్ 2% శాస్త్రవేత్తల జాబితాలో ఆదిమూలంవారిపాలెం వాసి వైఎస్సార్‌సీపీ ‘గడప గడపకు’ కార్యక్రమం.. కోఆర్డినేటర్ గన్నవరపు శ్రీనివాసరావు ధ్వజం! ఎస్జీఎఫ్ రాష్ట్రస్థాయి క్రీడా పోటీలకు అంబాజీపేట విద్యార్థులు ఎంపిక: పీఎం సూర్యఘర్ పథకాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలి: ఎమ్మెల్యే నల్లమిల్లి. పోతవరం పంచాయతీలో వీబీజీ రామ్ అవగాహన ర్యాలీ - పాల్గొన్న శ్రామికులు, తనిఖీ బృందం పోలవరం ప్రాజెక్టును సందర్శించిన కానూరు హైస్కూల్ విద్యార్థులు

వైసీపీ హయాంలో ప్రాజెక్టులకు బ్రేకులు..కూటమి పాలనలో పరుగులు

Select Suryaa Now
వైసీపీ హయాంలో ప్రాజెక్టులకు బ్రేకులు..కూటమి పాలనలో పరుగులు

చేయని పనులకు క్రెడిట్ కొట్టేయాలని చూస్తున్నారు..

విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్

 ఏపీ స్టేట్ బ్యూరో, అమరావతి :

వైసీపీ ఐదేళ్ల పాలనలో రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టులు తీవ్ర నిర్లక్ష్యానికి గురయ్యాయని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ విమర్శించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నిలిచిపోయిన ప్రాజెక్టులకు వేగం పెంచి ఒక్కొక్కటిగా పనులు పూర్తి చేస్తోందని తెలిపారు. వైసీపీ హయాంలో గుండ్లకమ్మ గేటు విరిగినా పట్టించుకోలేదని, వెలుగొండ టన్నల్‌లో యంత్రం ఇరుక్కున్నా బయటకు తీసేందుకు చర్యలు తీసుకోలేదని, పోలవరం పనులు నిలిచిపోయినా చలనం లేకపోయిందని ఆరోపించారు.

గుండ్లకమ్మ గేటు అమర్చకుండా ఇసుక దోపిడీకి ప్రాధాన్యమిచ్చారని మంత్రి విమర్శించారు. ప్రజల నీటి అవసరాల కంటే ధనదాహమే వైసీపీ ప్రభుత్వానికి ముఖ్యమైందని అన్నారు. 70 శాతం పూర్తయిన పోలవరం పనులను ఐదేళ్లలో ఒక్క శాతం కూడా ముందుకు తీసుకెళ్లలేదని ఆరోపించారు. వెలుగొండ ప్రాజెక్టుకు కూటమి ప్రభుత్వం వెయ్యి కోట్ల రూపాయలు కేటాయించి నిర్వాసితులకు పరిహారం అందించిందని, ఫీడర్‌ కెనాల్ పూర్తి చేయడంతో పాటు టన్నల్‌లో ఇరుక్కున్న యంత్రాన్ని బయటకు తీసి పనులకు వేగం పెంచామని చెప్పారు.

చంద్రబాబు ఆదేశాలతో ప్రకాశం జిల్లా టీడీపీ నేతలు ఢిల్లీ వెళ్లి వెలుగొండ ప్రాజెక్టుకు గెజిట్ నోటిఫికేషన్ సాధించారని గొట్టిపాటి తెలిపారు. కలగా మిగిలిపోతుందనుకున్న వెలుగొండకు 10 టీఎంసీల నీటిని తీసుకొచ్చిన ఘనత కూటమి ప్రభుత్వానిదేనన్నారు. తాము పూర్తి చేసి నీళ్లు పారిస్తున్న ప్రాజెక్టులపై వైసీపీ నేతలు గొప్పలు చెప్పుకోవడం విడ్డూరంగా ఉందని, చేయని పనులకు క్రెడిట్ అడగడం వైసీపీకి అలవాటైపోయిందని మంత్రి మండిపడ్డారు. ప్రజలు మాత్రం గతంలో ఎవరు ఏం చేశారో మరిచిపోలేదని అన్నారు.