సాఫ్ట్‌బాల్ జిల్లా స్థాయి ఎంపికలు
నరసన్నపేట అక్టోబర్ 4 మేజర్ న్యూస్ : స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో అండర్-19 బాలబాలికల సాఫ్ట్‌బాల్ జిల్లా స్థాయి ఎంపికలు నరసన్నపేటలో ఉత్సాహంగా నిర్వహించారు. నరసన్నపేటలోని పీఎం శ్రీ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో జరిగిన ఈ ఎంపికలకు జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి సుమారు 100 మంది క్రీడాకారులు హాజరై తమ ప్రతిభను ప్రదర్శించారు.
ఎంపికైన క్రీడాకారులు ఈ నెల 10వ తేదీ నుంచి పశ్చిమ గోదావరి జిల్లాలో జరగనున్న రాష్ట్ర స్థాయి సాఫ్ట్‌బాల్ పోటీల్లో పాల్గొననున్నారు. జిల్లా స్థాయి ఎంపికల్లో ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను నిర్వాహకులు అభినందించారు.
కార్యక్రమంలో ఇన్‌చార్జి హెచ్‌ఎం సాయి శ్రీనివాస్, స్టేట్ సాఫ్ట్‌బాల్ అసోసియేషన్ కన్వీనర్ ఎం.వి. రమణ, జిల్లా వైస్ ప్రెసిడెంట్ ఎం. తిరుపతిరావు, జిల్లా కోశాధికారి సత్యనారాయణ పాల్గొన్నారు.
ఎంపికల ప్రక్రియలో సెలెక్టర్లుగా ఆనంద్ కిరణ్, రాజగోపాల్, రామరాజు, మధు, చిన్నికృష్ణ, గణపతిరావు వ్యవహరించారు. వైఎంసీఏ కార్యదర్శి చిట్టిబాబు, కే. మురళి, తదితరులు పాల్గొన్నారు.