BREAKING
రేపు కలెక్టరేట్ లో పి.జి.ఆర్.ఎస్, రెవెన్యూ క్లినిక్ ఆపరేషన్ త్రిశూల్‌లో భాగంగా వత్సవాయిలో విస్తృత వాహన తనిఖీలు ఘనవిజయమే లక్ష్యంగా ఆత్మకూరు మున్సిపల్ ఎన్నికలపై ఎన్ డి ఏ కూటమి కీలక భేటీ పాకిస్థాన్ హనీట్రాప్ ఉచ్చులో భారత నావికాదళ సెయిలర్ రాష్ట్రస్థాయి బ్యాడ్మింటన్ పోటీలకు ఆర్షిత రేచల్ ఎంపిక 2030 నాటికి భారతీయ పర్యాటకుల బసను రెట్టింపు చేయడమే లక్ష్యం: జర్మనీ పర్యాటక బోర్డు కీలక ప్రకటన తీరంలో పుట్టగొడుగుల్లా దుకాణాలు* నగర అభివృద్ధికి పునాదులు వేసిన మహానుభావుడు స్వర్గీయ మాజీ శాసనసభ్యులు పునుగుపాటి రూ.54 లక్షల రైస్‌మిల్లు బిల్లులపై రగడ యుద్ధ విమానాల కొరతపై వైమానిక దళ చీఫ్ ఆందోళన సమాజాభివృద్ధికి కృషి చేయాలి. సాగునీటి ప్రాజెక్టులపై సమీక్షా సమావేశం $10.5 బిలియన్ల విమానాల కాంట్రాక్ట్ దక్కితే భారత్‌లో భారీగా తయారీ విస్తరణ : లాక్‌హీడ్ మార్టిన్ కీలక ప్రకటన వైసీపీ హయాంలో ప్రాజెక్టులకు బ్రేకులు..కూటమి పాలనలో పరుగులు నూకాంబికా అమ్మవారిని దర్శించుకున్న హోం మంత్రి అనిత కుటుంబ

గౌడ సంఘాన్ని మరింత పటిష్టం చేస్తాం*

Select Suryaa Now
గౌడ సంఘాన్ని మరింత పటిష్టం చేస్తాం*

మండవల్లి /కైకలూరు, మేజర్ న్యూస్, గౌడ సంఘాన్ని రాష్ట్రవ్యాప్తంగా మరింత పటిష్టం చేసి, గౌడ కులస్తుల ఐక్యతను చాటేందుకు కృషి చేస్తామని రాష్ట్ర వ్యవస్థాపక సంఘం అధ్యక్షులు చలపాటి వెంకటేశ్వరరావు, రాష్ట్ర నూతన గౌడ సంఘం అధ్యక్షులు పోసిన చెంచు రామారావులు అన్నారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాలు, నియోజకవర్గాలు, మండలాల్లో పటిష్టమైన కమిటీలను ఏర్పాటు చేస్తామని తెలిపారు.ఆదివారం మండవల్లి మండలం అల్లినగరంలోని వినాయక ఉత్సవ మండపం వద్ద జన్ను వీరబాబు ఆధ్వర్యంలో కైకలూరు నియోజకవర్గ గౌడ సంఘం ఆత్మీయ సభ నిర్వహించారు. నియోజకవర్గ గౌడ సంఘం అధ్యక్షులు పోలగాని నాగరాజు, శొంఠి కుమార్ స్వామి సభకు అధ్యక్షత వహించారు.కార్యక్రమానికి చలపాటి వెంకటేశ్వరరావు, పోసిన చెంచు రామారావు, వీరమల్లు నరసింహారావు, ప్రధాన కార్యదర్శి మరీదు శివరామకృష్ణ, పరసా ఏడుకొండలు, వీరంకి రామచంద్రరావు తదితరులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.ఈ సందర్భంగా పోసిన చెంచు రామారావు మాట్లాడుతూ గౌడ సంఘం బలోపేతానికి సామాజిక ఐక్యత, సంక్షేమం, రాజకీయంగా బలోపేతం కావడం ఎంతో అవసరమన్నారు.త్వరలో విజయవాడ కేంద్రంగా సుమారు పదివేల మంది గౌడ కులస్తుల సమక్షంలో రాష్ట్ర అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు తెలిపారు.సమావేశంలో రాష్ట్ర నాయకులు యార్లగడ్డ గోవర్ధన్, ఉయ్యూరు మురళీ, మండవల్లి మండల అధ్యక్షులు బొర్రా సత్యనారాయణ, నారగాని కొండతో పాటు సంఘ పెద్దలు, నాయకులు పాల్గొన్నారు.

 సంజీవరావు మండవల్లి