BREAKING
భవిష్యత్ అవసరాల దూరదృష్టితోనే కొత్త రహదారుల నిర్మాణం మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి శింగనమలలో రేపు మంత్రి పయ్యావుల కేశవ్ పర్యటన... పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొననున్న రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి... రేపు కలెక్టరేట్ లో పి.జి.ఆర్.ఎస్, రెవెన్యూ క్లినిక్ ఆపరేషన్ త్రిశూల్‌లో భాగంగా వత్సవాయిలో విస్తృత వాహన తనిఖీలు ఘనవిజయమే లక్ష్యంగా ఆత్మకూరు మున్సిపల్ ఎన్నికలపై ఎన్ డి ఏ కూటమి కీలక భేటీ పాకిస్థాన్ హనీట్రాప్ ఉచ్చులో భారత నావికాదళ సెయిలర్ రాష్ట్రస్థాయి బ్యాడ్మింటన్ పోటీలకు ఆర్షిత రేచల్ ఎంపిక 2030 నాటికి భారతీయ పర్యాటకుల బసను రెట్టింపు చేయడమే లక్ష్యం: జర్మనీ పర్యాటక బోర్డు కీలక ప్రకటన తీరంలో పుట్టగొడుగుల్లా దుకాణాలు* నగర అభివృద్ధికి పునాదులు వేసిన మహానుభావుడు స్వర్గీయ మాజీ శాసనసభ్యులు పునుగుపాటి రూ.54 లక్షల రైస్‌మిల్లు బిల్లులపై రగడ యుద్ధ విమానాల కొరతపై వైమానిక దళ చీఫ్ ఆందోళన సమాజాభివృద్ధికి కృషి చేయాలి. సాగునీటి ప్రాజెక్టులపై సమీక్షా సమావేశం $10.5 బిలియన్ల విమానాల కాంట్రాక్ట్ దక్కితే భారత్‌లో భారీగా తయారీ విస్తరణ : లాక్‌హీడ్ మార్టిన్ కీలక ప్రకటన

శిష్టకరణం నూతన కార్యవర్గం ఎన్నిక

Select Suryaa Now
శిష్టకరణం నూతన కార్యవర్గం ఎన్నిక
  • జాతి ఐక్యతకు కృషి.. ఎస్‌ఎంసీ చైర్మన్‌గా ఎన్నికైన బెహరా జగన్నాథం పట్నాయక్‌కు ఘన సన్మానం

​హిరమండలం: మండల శిష్టకరణం సంఘం నూతన కార్యవర్గాన్ని స్థానిక శ్రీ జగన్నాథ స్వామి ఆలయ ప్రాంగణంలో ఆదివారం నిర్వహించిన సమావేశంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ నూతన కమిటీ అధ్యక్షుడిగా డబ్బీరు కృష్ణారావు, ప్రధాన కార్యదర్శిగా బెహరా సుధాకర్, ఉపాధ్యక్షులుగా సదాశివుని రామ శంకర్, బెహరా జగన్నాథం, సహాయ కార్యదర్శులుగా కరణం సంజీవ రావు, అల్లిన సురేష్, కోశాధికారిగా కోడూరు వంశీ, ఆర్గనైజింగ్ కార్యదర్శిగా ఉదండరావు రాజేష్, మహిళా కార్యదర్శిగా బెహరా ఉషా రాణి, న్యాయ సలహాదారుగా నందిగాం ఆనందరావు, గౌరవ అధ్యక్షుడిగా నందిగాం శ్రీనివాసరావు, గౌరవ సలహాదారుడిగా రఘుపాత్రని గోవింద పట్నాయక్, మరియు కార్యవర్గ సభ్యులుగా సదాశివుని నాగేశ్వరావు, బలివాడ రామ కృష్ణ, కరకవలస సురేష్, ఉరిటీ జయకృష్ణలు ఎంపికయ్యారు. ఈ సందర్భంగా నూతన అధ్యక్షుడు డబ్బీరు కృష్ణారావు, కార్యదర్శి బెహరా సుధాకర్ మాట్లాడుతూ మండలంలో శిష్టకరణ సామాజిక వర్గ ఐక్యత, అభివృద్ధి, సంక్షేమానికి తోడ్పడతామని, సభ్యులకు ఏ సమస్య వచ్చినా సంఘం పరంగా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. అలాగే, ఇటీవల శుభలయ ఆర్ ఆర్ కాలనీ జడ్పీ హైస్కూల్ పాఠశాల నిర్వహణ కమిటీ (ఎస్‌ఎంసీ) చైర్మన్‌గా ఏకగ్రీవంగా ఎన్నికైన బెహరా జగన్నాథం పట్నాయక్‌‌ను సంఘ సభ్యులంతా శాలువా కప్పి, పుష్పగుచ్ఛం అందించి ఘనంగా సత్కరించారు. చివరగా, సంఘం తదుపరి సమావేశాన్ని నవంబర్ 1వ తేదీన నిర్వహించనున్నట్లు సభ్యులు తెలియజేశారు.