BREAKING
'మిస్టర్ కూల్' ధోనీ సూత్రంతోనే టీమిండియాను ఓడించాం : విండీస్ కెప్టెన్ షాయ్ హోప్ ఆత్మకూరులో కెవిపి ఎస్ జెండా ఆవిష్కరణ దసరా ఉత్సవాలకు బాలినేని శ్రీనివాసులు రెడ్డిని ఆహ్వానించిన వేణుగోపాల్ రెడ్డి భవిష్యత్ అవసరాల దూరదృష్టితోనే కొత్త రహదారుల నిర్మాణం మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి శింగనమలలో రేపు మంత్రి పయ్యావుల కేశవ్ పర్యటన... పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొననున్న రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి... రేపు కలెక్టరేట్ లో పి.జి.ఆర్.ఎస్, రెవెన్యూ క్లినిక్ ఆపరేషన్ త్రిశూల్‌లో భాగంగా వత్సవాయిలో విస్తృత వాహన తనిఖీలు ఘనవిజయమే లక్ష్యంగా ఆత్మకూరు మున్సిపల్ ఎన్నికలపై ఎన్ డి ఏ కూటమి కీలక భేటీ పాకిస్థాన్ హనీట్రాప్ ఉచ్చులో భారత నావికాదళ సెయిలర్ రాష్ట్రస్థాయి బ్యాడ్మింటన్ పోటీలకు ఆర్షిత రేచల్ ఎంపిక 2030 నాటికి భారతీయ పర్యాటకుల బసను రెట్టింపు చేయడమే లక్ష్యం: జర్మనీ పర్యాటక బోర్డు కీలక ప్రకటన తీరంలో పుట్టగొడుగుల్లా దుకాణాలు* నగర అభివృద్ధికి పునాదులు వేసిన మహానుభావుడు స్వర్గీయ మాజీ శాసనసభ్యులు పునుగుపాటి రూ.54 లక్షల రైస్‌మిల్లు బిల్లులపై రగడ యుద్ధ విమానాల కొరతపై వైమానిక దళ చీఫ్ ఆందోళన

హోర్ముజ్ జలసంధి గుండా 20 లక్షల బ్యారెళ్ల ముడి చమురును రవాణా చేసిన ఇరాక్

Select Suryaa Now
హోర్ముజ్ జలసంధి గుండా 20 లక్షల బ్యారెళ్ల ముడి చమురును రవాణా చేసిన ఇరాక్

సూర్య అంతర్జాతీయ డెస్క్: అంతర్జాతీయ చమురు రవాణాలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇరాక్‌కు చెందిన ప్రభుత్వ రంగ చమురు ట్యాంకర్ల సంస్థ దశాబ్దాల కాలంలో తొలిసారిగా హోర్ముజ్ జలసంధి గుండా భారీ నౌక ద్వారా ముడి చమురును విజయవంతంగా రవాణా చేసింది. అత్యంత విశాలమైన ఒక క్రూడ్ క్యారియర్ నౌక ద్వారా సుమారు 20 లక్షల బ్యారెళ్ల ఇరాక్ ముడి చమురును ఈ మార్గం గుండా తరలించినట్లు ఆ సంస్థ డైరెక్టర్ జనరల్ అధికారికంగా వెల్లడించారు. ఈ చారిత్రాత్మక రవాణా ప్రక్రియతో ఇరాక్ చమురు మార్కెటింగ్ సంస్థకు అంతర్జాతీయ మార్కెట్లో విక్రయాలు జరిపేందుకు మరింత వెసులుబాటు కలగనుంది.

గతంలో కేవలం బస్రా ఓడరేవు ద్వారా మాత్రమే చమురు ఎగుమతులు జరిగేవి. అయితే ఇప్పుడు నేరుగా హోర్ముజ్ జలసంధి గుండానే ముడి చమురును తరలించడం ద్వారా గ్లోబల్ మార్కెట్లో మెరుగైన ధరలను, విక్రయ అవకాశాలను అందిపుచ్చుకోవడానికి వీలవుతుందని అధికారులు స్పష్టం చేశారు. అంతర్జాతీయంగా మారుతున్న వాణిజ్య పరిస్థితులకు అనుగుణంగా తమ సంస్థ సేవలను విస్తరించుకునే ప్రణాళికలో భాగంగా ఈ చర్య చేపట్టినట్లు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో సమీక్షా భవిష్యత్తులో మరింత పోటీని తట్టుకునేందుకు వీలుగా ప్రత్యేక క్రూడ్ ఆయిల్ ట్యాంకర్లను కొనుగోలు చేసి తమ నౌకాదళ సామర్థ్యాన్ని మరింత పటిష్టం చేసుకోవడానికి సన్నాహాలు చేస్తున్నట్లు వెల్లడించారు.

అమెరికాతో జరిగిన ఘర్షణల సమయంలో ఇరాన్ తన ఆధీనంలో ఉన్న హోర్ముజ్ జలసంధిని ప్రభావశీలకంగా మూసివేసినప్పటికీ, ఇరాక్ చమురు నౌకలు ఆ మార్గం గుండా వెళ్లేందుకు ఇరాన్ నుంచి ప్రత్యేక అనుమతులు పొందినట్లు సమాచారం. ఈ నూతన రవాణా విధానం ద్వారా ఇరాక్ చమురు ఎగుమతులకు సరికొత్త మార్గాలు సుగమమం అవుతాయని ఇంధన రంగ నిపుణులు విశ్లేషిస్తున్నారు. ప్రాంతీయ షిప్పింగ్ కంపెనీలతో గట్టి పోటీని ఎదుర్కొంటూ దేశ ఆర్థిక వ్యవస్థను మరింత బలోపేతం చేసే దిశగా ఇరాక్ ప్రభుత్వం తీసుకుంటున్న ఈ చర్యలు అంతర్జాతీయ ఇంధన మార్కెట్లో ప్రాధాన్యత సంతరించుకున్నాయి. తద్వారా దేశీయ ఆదాయాన్ని పెంచుకోవడంతో పాటు ఎగుమతుల సామర్థ్యాన్ని మరింత విస్తృతం చేసేందుకు ఇరాన్ పరిసర ప్రాంతాల్లోని రవాణా మార్కాలను సమర్థవంతంగా వినియోగించుకుంటున్నట్లు స్పష్టమవుతోంది.