BREAKING
సమతుల ఆహారం ద్వారా మంచి ఆరోగ్యం పట్టభద్రులంతా విధిగా ఓటు నమోదు చేసుకోవాలి అమెరికా బందీల వ్యవహారాల ప్రత్యేక రాయబారిగా జాన్ కోల్ నియామకం ఆయుర్వేద వైద్యశాలకు స్వచ్ఛ అవార్డుపై అభినందనలు పోడు భూముల సమస్యలపై త్వరలో తీపి కబురు ...మంత్రి పొంగులేటి ఖాళీ ప్రదేశానికి ఏ విధంగా ఇంటి నెంబర్లు ఎలా ఇస్తారు బిజెపి పట్టణ అధ్యక్షుడు కర్రే ప్రవీణ్ ఫ్లైదుబాయ్ కో-పైలట్ ఆస్ట్రేలియా సంబంధాలపై భద్రతా దళాల దర్యాప్తు రేపు సూడేపల్లిలో పట్టాదారు పాస్‌బుక్‌ల పంపిణీ మంత్రి తుమ్మలకు వేంసూరు రైతుల విజ్ఞప్తి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కార్యకర్తల సమావేశాన్ని విజయవంతం చేయాలి 4 కోట్లతో... 3 తారురోడ్లు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు హౌతీల ఆధీనంలోని భూభాగాలను తిరిగి స్వాధీనం చేసుకునేందుకు సైనిక చర్యలు ప్రారంభించిన ప్రభుత్వం నేడు కలెక్టరేట్ లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక. మోదీ అభివృద్ధికి ఆకర్షితులై బీజేపీలోకి 50 మంది చేరిక భక్తిశ్రద్ధలతో శ్రీ సుదర్శన హవనం

మహిళలకు ఉచిత వృత్తి శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేయాలి: కె. సుజాత

Select Suryaa Now
మహిళలకు ఉచిత వృత్తి శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేయాలి: కె. సుజాత


హైదరాబాద్: బీసీ, ఎస్సీ, ఎస్టీ చైతన్య వేదిక తెలంగాణ రాష్ట్ర కార్యాలయంలో ఆదివారం రాష్ట్ర అధ్యక్షురాలు కె. సుజాత అధ్యక్షతన సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా కె. సుజాత మాట్లాడుతూ మహిళలు ఆర్థికంగా స్వయం సమృద్ధి సాధించేందుకు రాష్ట్రవ్యాప్తంగా ఉచిత వృత్తి శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలని కోరారు. ముఖ్యంగా మహిళలకు టైలరింగ్, బ్యూటీషియన్, మగ్గం తదితర వృత్తి విద్యల్లో ఉచిత శిక్షణ అందించేలా శిక్షణా కేంద్రాలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.
మహిళలకు శిక్షణ అందించడం ద్వారా వారు స్వయం ఉపాధి పొందడంతో పాటు కుటుంబ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుచుకునే అవకాశం ఉంటుందని ఆమె పేర్కొన్నారు. ప్రతి ప్రాంతంలో అవసరాన్ని బట్టి శిక్షణా కేంద్రాలను ఏర్పాటు చేసి, శిక్షణ పూర్తిచేసిన వారికి ఉపాధి అవకాశాలు కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు.
ఈ సమావేశంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దోరై మలతి, గ్రేటర్ ఉపాధ్యక్షురాలు గురు లక్ష్మి, జంగమ్మెట్ డివిజన్ ప్రధాన కార్యదర్శి స్వాతి, రాష్ట్ర కార్యనిర్వహణ అధ్యక్షుడు డి. ప్రసాద్, గ్రేటర్ ఉపాధ్యక్షుడు రాధాకృష్ణ తదితరులు పాల్గొన్నారు.