BREAKING
కానిస్టేబుళ్లదే కీలక పాత్ర.. ప్రజలతో మర్యాదగా మెలగాలి బాల న్యాయ వ్యవస్థపై పోలీసులకు అవగాహన పోరంకి–కానూరుకు రూ.34.92 కోట్ల అభివృద్ధి పనులు.. తెలంగాణ గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికలు...జనతా పరివార్ పార్టీ అభ్యర్థుల ప్రకటన అభివృద్ధిని చూసి వైసీపీకి కడుపుమంట.. అంతరాష్ట్ర దొంగల ముఠా అరెస్ట్‌.. రూ.5 లక్షల సొత్తు, రెండు కార్లు స్వాధీనం ఇంట్లో ఇనుపరాడ్‌తో భార్యపై దాడి మేయర్‌గా బొండా సిద్ధార్థకు అవకాశం కల్పించాలి వైభవంగా విజయవాడ ఉత్సవ్–2.. జాతీయస్థాయి కుంగ్ ఫూ కరాటే పోటీల్లో శ్రీ సత్య విద్యానికేతన్ విద్యార్థుల ప్రతిభ. గర్భిణీ స్త్రీలు మంచి పౌష్టికాహారాన్ని తీసుకోవాలి పల్లె పండుగ 3.0తో పల్లెలకు మహర్దశ - పి.గన్నవరంలో రూ.4.30 కోట్ల అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే గిడ్డి శంకుస్థాపన పత్తి రైతులను ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలి. కొండా లక్ష్మణ్ బాపూజీ కుమార్తెకు ఎమ్మెల్సీ పదవి? తండ్రి అడుగుజాడల్లో తనయుడు.. జక్కంపూడి రాజా సేవా స్ఫూర్తి

సమతుల ఆహారం ద్వారా మంచి ఆరోగ్యం

Select Suryaa Now
సమతుల ఆహారం ద్వారా మంచి ఆరోగ్యం

కనిగిరి ,మేజర్ న్యూస్ :మండలం లోని నారపురెడ్డిపల్లి అంగనవాడి కేంద్రంలో ఆదివారం 9వ జాతీయ పోషణ మాసంలో భాగంగా అంగన్ వాడి ఉత్సవం కార్యక్రమం ఐసిడిఎస్ సూపర్వైజర్ ఎం వి ఎస్. పార్వతి ఆధ్వర్యంలో నిర్వహించారు.అంగన్వాడీ కేంద్రంలో పోషణ లోగోను ప్రదర్శించారు. ఈ సందర్భంగా పార్వతి మాట్లాడుతూ గర్భవతులు, బాలింతలు, కిశోర్ బాలికలు చిన్నపిల్లలలో పోషకాహార లోపాన్ని నివారించడానికి సమతుల ఆహారం , ఆహార వైవిధ్యం ,తగినంత ప్రోటీన్ తీసుకోవాలన్నారు .జంక్ ఫుడ్ కు దూరంగా ఉంటూ ఇంటి ఫుడ్డునే తినాలని, వంటల్లో మునగాకు పొడిని వినియోగించాలని, సామూహిక యాజమాన్యం మరియు జవాబిదారితనం, మారిన మెనూ చాట్ ప్రదర్శన &వివరణ ,టేక్ హోమ్ రేషన్ పోషక పదార్థాల పరిమాణం, ఏఎంసి కమిటీల పాత్ర,పి ఎంఎంవి వై పథకం గురించి అవగాహన కలిగిస్తూ అందరం కలిసి సుపోషిత, సమృద్ధ భారత నిర్మాణంలో భాగస్వాములవుదామని పిలుపునిచ్చారు.అనంతరం ఎగ్ ఫ్రైడ్ రైస్ తయారీపై వంటల పోటీలు నిర్వహించి, లబ్ధిదారులతో రుచి చూపించారు.వంట పోటీలలో పాల్గొన్న, సామాజిక సేవలు అందిస్తున్న హెల్పర్స్ ధనలక్ష్మి ,భాగ్యలక్ష్మి, నారాయణమ్మ, గోవిందమ్మ లను అభినందిస్తూ సూపర్వైజర్ పార్వతి వారిని ఘనంగా సన్మానించారు .కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్లు ఎం .రమణమ్మ ,పి. కళ్యాణి ,గర్భవతులు, బాలింతలు, కిషోర్ బాలికలు, ఏఎంసీ సభ్యులు ,పిల్లలు పాల్గొన్నారు.