విద్యార్థి దశ నుంచే క్రీడలపై ఆసక్తి పెంచుకోవాలి
ఆత్మవిశ్వాసం, పట్టుదలతో ముందుకు సాగాలి
కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు జాదవ్ ధారాసింగ్ నాయక్
తాండూరు, మేజర్ న్యూస్ (అక్టోబర్ 4): విద్యార్థి దశ నుంచే ప్రతి ఒక్కరూ క్రీడలపై ఆసక్తి పెంపొందించుకోవాలని కాంగ్రెస్ పార్టీ వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు జాదవ్ ధారాసింగ్ నాయక్ అన్నారు. ఆత్మవిశ్వాసం, క్రమశిక్షణ, పట్టుదలతో ముందుకు సాగితే జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవచ్చని పేర్కొన్నారు.తాండూరు పట్టణంలోని సెయింట్ మార్క్స్ పాఠశాల ఆవరణలో ఆదివారం నిర్వహిస్తున్న ఇంటర్ డిస్ట్రిక్ట్ జూనియర్ అథ్లెటిక్స్ మీట్–2026 పోటీలను ధారాసింగ్ నాయక్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. క్రీడలతో పాటు చదువులోనూ విద్యార్థులు పట్టుదలతో రాణించాలని సూచించారు. వివిధ క్రీడా విభాగాల్లో ప్రతిభ కనబరుస్తున్న క్రీడాకారులకు రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రోత్సాహం లభించేలా కృషి చేస్తామని తెలిపారు.విద్యార్థుల ప్రతిభను వెలికితీయడంలో తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల పాత్ర కీలకమని, వారు సంపూర్ణ సహకారం, ప్రోత్సాహం అందించాలని ధారాసింగ్ నాయక్ కోరారు.ఈ కార్యక్రమంలో జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ లొంక నర్సింలు, తాండూరు మున్సిపల్ చైర్‌పర్సన్ నీరజ బాల్‌రెడ్డి, కాంగ్రెస్ పార్టీ టౌన్ అధ్యక్షుడు నాగరాజ్, నాయకులు సంతోష్, వడ్డే శ్రీనివాస్, హన్మాపూర్ గ్రామ సర్పంచ్ లొంక రాములు, ఎస్‌జీటీ జనరల్ సెక్రటరీ రాజశేఖర్, పలువురు వ్యాయామ ఉపాధ్యాయులు, క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు.
రిపోర్టర్ రామచందర్.