BREAKING
ఆయుర్వేద వైద్యశాలకు స్వచ్ఛ అవార్డుపై అభినందనలు పోడు భూముల సమస్యలపై త్వరలో తీపి కబురు ...మంత్రి పొంగులేటి ఖాళీ ప్రదేశానికి ఏ విధంగా ఇంటి నెంబర్లు ఎలా ఇస్తారు బిజెపి పట్టణ అధ్యక్షుడు కర్రే ప్రవీణ్ ఫ్లైదుబాయ్ కో-పైలట్ ఆస్ట్రేలియా సంబంధాలపై భద్రతా దళాల దర్యాప్తు రేపు సూడేపల్లిలో పట్టాదారు పాస్‌బుక్‌ల పంపిణీ మంత్రి తుమ్మలకు వేంసూరు రైతుల విజ్ఞప్తి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కార్యకర్తల సమావేశాన్ని విజయవంతం చేయాలి 4 కోట్లతో... 3 తారురోడ్లు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు హౌతీల ఆధీనంలోని భూభాగాలను తిరిగి స్వాధీనం చేసుకునేందుకు సైనిక చర్యలు ప్రారంభించిన ప్రభుత్వం నేడు కలెక్టరేట్ లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక. మోదీ అభివృద్ధికి ఆకర్షితులై బీజేపీలోకి 50 మంది చేరిక భక్తిశ్రద్ధలతో శ్రీ సుదర్శన హవనం క్షమాగుణమే ప్రతీకారానికి సరైన సమాధానం - ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ ఉద్బోధ టిడిపినేత వెంగయ్యను సత్కరించిన బద్వేలు టిడిపి ఇంచార్జి ఆలయంలో నిత్యారాధనలు భక్తులతో కిటకిటలాడిన యాదాద్రి

భద్రాద్రి ధర్మల్ పవర్ స్టేషన్ lo మూడో యూనిట్ నిలిచిపోవడం ప్రభుత్వ వైఫల్యమే.. మాజీ మంత్రి పువ్వాడ

Select Suryaa Now
భద్రాద్రి ధర్మల్ పవర్ స్టేషన్ lo మూడో యూనిట్ నిలిచిపోవడం ప్రభుత్వ వైఫల్యమే.. మాజీ మంత్రి పువ్వాడ

--భద్రాద్రి థర్మల్ పవర్ స్టేషన్‌లో మూడో యూనిట్ నిలిచిపోవడం ప్రభుత్వ వైఫల్యమే

-- మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్

--- విద్యుత్ ప్లాంట్ల నిర్వహణలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం
ఖమ్మం (సూర్య బ్యూరో):
భద్రాద్రి థర్మల్ పవర్ స్టేషన్‌లోని మూడో యూనిట్‌లో విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోవడంపై మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ రాష్ట్ర ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యుత్ డిమాండ్ పెరుగుతున్న సమయంలో కీలకమైన యూనిట్‌ నిలిచిపోవడం ప్రభుత్వ విద్యుత్ నిర్వహణలో నిర్లక్ష్యానికి, వైఫల్యానికి నిదర్శనమని విమర్శించారు.ప్రభుత్వ నిర్లక్ష్యంతో ఈ యూనిట్ నిలిచిపోవడంతో రోజుకు 270 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి అంతరాయం కలిగిందని ఇప్పటివరకు సుమారు 15.5 కోట్ల యూనిట్ల విద్యుత్ ఉత్పత్తికి ఆటంకం కలిగిందని మాజీ మంత్రి పువ్వాడ ఆందోళన వ్యక్తంచేశారు. విద్యుత్ ఉత్పత్తి సంస్థల్లో కీలకమైన పరికరాల నిర్వహణ, ముందస్తు తనిఖీలు, స్పేర్ పార్ట్స్ అందుబాటులో ఉంచడంలో ప్రభుత్వం ఎందుకు నిర్లక్ష్యం వహించిందో సమాధానం చెప్పాలని  డిమాండ్ చేశారు. నిలిచిపోయిన మూడో యూనిట్‌ను వెంటనే పునరుద్ధరించేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలేమిటో వెల్లడించాలని మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ప్రశ్నించారు.