నీటిని పొదుపుగా వాడుకోవాలి* *మున్సిపల్ కమిషనర్ నాగరాజు*
*నేరేడుచర్ల, మేజర్ న్యూస్*
ప్రస్తుత సంక్షుభిత పరిస్థితుల్లో మనమందరం అత్యంత కీలకమైన అంశంపై దృష్టి సారించాల్సిన ఆవశ్యకత ఏర్పడింది.ఎల్‌నినో ప్రభావంతో అడుగంటుతున్న భూగర్భ జలాలు
ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న తీవ్రమైన ఎల్‌నినో వాతావరణ ప్రభావం కారణంగా ఈ ఏడాది వర్షపాతం గణనీయంగా తగ్గింది. ఎండల తీవ్రత విపరీతంగా పెరగడంతో భూమి వేడెక్కి, భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయి.
ప్రతి నీటి బొట్టు భవిష్యత్తుకు రక్షణే
అవసరం మేరకే వాడుకోవాలి.మిషన్ భగీరథ ద్వారా వస్తున్న తాగునీటిని అవసరమైన మేరకు మాత్రమే వాడుకోవాలి.నల్లాలకు తప్పనిసరిగా ట్యాపులు ఉండాలి. ప్రతి ఇంటి నల్లాకు తప్పనిసరిగా ట్యాపులు (ఆన్/ఆఫ్) బిగించుకోవాలి. నీటిని వృథాగా రోడ్లపైకి, కాలువల్లోకి వదలకుండా జాగ్రత్తగా కాపాడుకోవాలి.
ఇష్టానుసారంగా నీటిని వృథా చేస్తే, రాబోయే కాలంలో మున్సిపాలిటీ తరపున కఠినమైన ఆంక్షలు, చర్యలు తీసుకోవాల్సి వస్తుంది.
కావున నేరేడుచర్ల మున్సిపల్ పరిధిలోని ప్రజలందరూ ఈ తీవ్రతను గుర్తించి, నీటి సంరక్షణలో మున్సిపల్ యంత్రాంగానికి పూర్తిగా సహకరించాలని, ఇంటింటి వర్షపు నీటి ఇంకుడు గుంత ఏర్పాటు చేసుకోవాలని మున్సిపల్ కమిషనర్ నాగరాజు కోరారు.నీటిని కాపాడుకుందాం... భావితరాలకు భరోసా ఇద్దాం! నేరేడుచర్ల ప్రజల సంక్షేమమే మున్సిపాలిటీ ఏకైక లక్ష్యమన్నారు.