BREAKING
విలేకరుల శిక్షణలో రేణిగుంట 6టీవీ రిపోర్టర్ శీను భారత పారిశ్రామికోత్పత్తిలో విరుద్ధ ధోరణులు: టెక్స్‌టైల్స్, అపెరల్ తయారీ రంగాల మధ్య పెరుగుతున్న భారీ అంతరం అంబేద్కర్ లేకుంటే మన బ్రతుకులు ఏమయ్యేవి…? ఎస్ఐఆర్ అంటే మీకు ఎందుకు జంకు జాతీయ స్థాయి మేళాకి నారాయణపేట విద్యార్థి ఎంపిక జనవిజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో వైద్య శిభిరం అభిమాని అతిచర్యకు షాకైన కన్నడ నటి రచితా రామ్.. నెట్టింట వైరల్ అవుతున్న వీడియో సంస్కార భారతి ఆధ్వర్యంలో బతుకమ్మ ఉత్సవాలను ఘనంగా నిర్వహిద్దాం : రాష్ట్ర సంఘటన మంత్రి జిపి నిరంజన్ 35 రూపాయలకే కిలో ఉల్లిపాయలు క్యాతన్ పల్లి లో నూతన సీతాఫల్ పల్ప్ కేంద్రం పరిశీలించిన జిల్లా అధికారులు మున్సిపల్ రిజర్వేషన్స్ పై ఉత్కంఠత సాగర్ ఆయకట్టుకు గోదావరి జలాలు.. మంత్రి తుమ్మల ఎన్టీఆర్‌కు మద్దతుగా నిలిచిన విజయ్ దేవరకొండ: ఏఐ దుర్వినియోగంపై హీరో తీవ్ర ఆగ్రహం కదిరిలో వివాహ వేడుకకు హాజరైన వైఎస్సార్‌సీపీ నాయకులు కైవ్‌లోని వంతెనతో పాటు నల్ల సముద్రంలో రెండు నౌకలపై రష్యా దాడులు

నేరెళ్ల బాధితులను మోసం చేసిన రేవంత్ రెడ్డికి గుణపాఠం తప్పదు

Select Suryaa Now
నేరెళ్ల బాధితులను మోసం చేసిన రేవంత్ రెడ్డికి గుణపాఠం తప్పదు

తక్షణమే కరువు మండలాలను ప్రకటించాలి 
తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత డిమాండ్ 

నేరెళ్ల బాధితులను కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు దగా చేస్తున్నాయని విమర్శ

తెలంగాణ బ్యూరో ప్రతినిధి : నేరెళ్ల బాధితులను కాంగ్రెస్, బీఆర్ఎస్ దగా చేస్తున్నాయని తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత మండిపడ్డారు. ఆనాటి బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇసుక మాఫియాను అడ్డుకొని ప్రశ్నించినందుకు నేరెళ్ల బాధితులపై జరిపిన దాష్టీకాల ఆధారాలను మాయం చేశారని ధ్వజమెత్తారు. ఆ ఆధారాలు బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే మాయం చేశారా? లేక కాంగ్రెస్ వచ్చాక మాయం అయ్యాయా చెప్పాలని నిలదీశారు. ఈమేరకు ఆదివారం మీడియాకు వీడియో సందేశం రిలీజ్ చేశారు. నేరెళ్ల బాధితుల దు:ఖాన్ని వాడుకొని అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి.. ఇప్పుడు వారిని మోసం చేస్తున్నాడని అన్నారు. అధికారంలోకి వచ్చి మూడేళ్లైనా ఆనాటి రిపోర్టులను ఇప్పటి వరకు వెలుగులోకి రాలేదని.. ఇప్పుడు అసలు వారు బాధితులని చెప్పటానికి ఆధారాలే లేవంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం సిగ్గుతో తలదించుకోవాలని అన్నారు. నేరెళ్ల బాధితుల విషయంలో ఆయన వ్యవహరిస్తున్న తీరుకు తగిన శాస్తి తప్పదని హెచ్చరించారు. సీఎం సిరిసిల్ల పర్యటనలో నేరెళ్ల బాధితులకు న్యాయం చేస్తారని భావిస్తే.. బాధితులకు రూ.5 లక్షలు, రూ.10 లక్షల చెక్కులు ఇచ్చి చేతులు దులుపుకున్నారని మండిపడ్డారు. బాధిత కుటుంబాలకు కోటి రూపాయల పరిహారం, మూడు ఎకరాల భూమి, ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చినప్పుడే వారికి న్యాయం జరగుతుందని..ముఖ్యమంత్రి ఊకదంపుడు ఉపన్యాసాలిస్తే జరగదని అన్నారు.

ఆధారాలు ఏమైనట్లు?

నేరెళ్ల ఘటనకు సంబంధించిన కీలకమైన ఆధారాలున్న రిపోర్టులు మాయమైనట్లు బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారని కవిత చెప్పారు. అసలు ఆ రిపోర్టులు ఏమయ్యాయో ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. అప్పటి జైలర్ రాసిన నివేదికలు, డీఐజీ రవివర్మ బాధితులతో మాట్లాడిన అంశాలతో సిద్ధం చేసిన రిపోర్టులు ఎటు పోయాయని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన ప్రధాన హామీల్లో నేరెళ్ల బాధితులకు న్యాయం చేస్తామన్న హామీ ఒకటని గుర్తు చేశారు. అధికారంలోకి వచ్చి మూడేళ్లైనా ఆ ఫైళ్లను కూడా చూడలేదని.. ముఖ్యమంత్రి సిరిసిల్లకు సభకు ముందు హడావుడిగా కేసు ఫైళ్లను చూసి న్యాయం చేయలేమని చెప్పడం సిగ్గుచేటన్నారు. ఘటనకు సంబంధించిన ఆధారాలు ఎవరి హయాంలో మాయమయ్యాయో చెప్పాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడే ఆధారాలు మాయం చేశారా లేక కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక మాయమయ్యా చెప్పాలన్నారు. బీఆర్ఎస్ హయాంలోనే ఆధారాలు ధ్వంసమై ఉంటే బాధ్యులైన అధికారులు, నాయకులపై ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రభుత్వాన్ని నిలదీశారు. ఫోన్ ట్యాపింగ్ కేసులోనూ ఇలాగే ఆధారాలు మాయం చేశారని చెప్తున్నారని గుర్తు చేశారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ లు కలిసి నేరెళ్ల బాధితులను దగా చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆనాటి ఆధారాలను మాయం చేసి బాధితులకు అన్యాయం చేసేలా కాంగ్రెస్, బీఆర్ఎస్ కుట్రలు చేస్తున్నాయన్నారు.

ఎస్సీ కమిషన్ నివేదిక ఏమైంది?

నేరెళ్ల ఘటనకు సంబంధించి నేషనల్ ఎస్సీ కమిషన్ ప్రజాకోర్టు, పబ్లిక్ హియరింగ్ నిర్వహించినా ఇప్పటికీ నివేదిక ఇవ్వలేదన్నారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి పెంచి ఆ రిపోర్ట్ ఇవ్వాలని ఎందుకు అడగడం లేదని ప్రశ్నించారు. తాము ఎన్నిసార్లు ఎస్సీ కమిషన్ అపాయింట్ మెంట్ అడిగిన సరే ఇవ్వడం లేదని.. దీని వెనుక ఏ శక్తి ఉందో అర్థం కావడం లేదన్నారు. బాధితులకు న్యాయం కోసం రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాస్తామన్నారు. 2017 జులైలో నేరెళ్లలో జరిగిన దాష్టీకం సిగ్గుతో తలదించుకునే ఘటన అని.. ఆ ఘటనను తెలంగాణ సమాజం ఎన్నటికీ మరిచిపోదని చెప్పారు. ఇసుక అక్రమ రవాణాను అడ్డుకున్నందుకు దళితులను టార్గెట్ చేసి కేసులు హింసిస్తే వారికి ఇప్పటికీ న్యాయం జరగకపోవడం దుర్మార్గమన్నారు.

బాధితులపై పెట్టిన కేసులు ఉపసంహరించుకోవాలి

నేరెళ్ల సంఘటనలో బాధితులపైనే అక్రమ కేసులు పెట్టి వారిని ఇబ్బందులు పెడుతున్నారని కవిత మండిపడ్డారు. నిందితులను కాపాడే విధంగా ఆధారాలు మాయం చేసి.. బాధితులను మాత్రం ఇబ్బంది పెట్టడం అన్యాయమన్నారు. వారిపై పెట్టిన కేసులను ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఇంకా కోర్టుల చుట్టూ తిరిగే ఓపిక వారికి లేదన్నారు. ప్రభుత్వం ఇకనైనా నిందితులను కాపాడే చర్యలు మానుకొని బాధితులకు అండగా నిలవాలని డిమాండ్ చేశారు.