BREAKING
నేడు గార్లకు రానున్న ఎమ్మెల్యే కోరం కనకయ్య కార్నెల్ విశ్వవిద్యాలయ సామూహిక అత్యాచార బాధితురాలికి బెదిరింపులు రెడ్‌క్రాస్‌ జిల్లా చైర్మన్‌గా డాక్టర్‌ ఎస్‌.ఎం. రాజేశ్వర్‌రావు స్థానిక ఎన్నికలకు వైఎస్సార్‌సీపీ సన్నద్ధం పెనుగంచిప్రోలులో పార్టీ శ్రేణులకు సభ్యత్వ కార్డుల పంపిణీ ఏఐ మార్ఫింగ్ వీడియోలపై జాన్వీ కపూర్ ఆవేదన: అనుమతి లేకుండా మహిళల చిత్రాలతో కల్పిత కంటెంట్ లైంగిక దాడికి సమానమని వ్యాఖ్య, ఎన్టీఆర్, చిరంజీవికి కృతజ్ఞతలు రాంపల్లి మరో జవహర్‌నగర్‌గా మారొద్దు.. ! సెంట్రల్ అమెరికన్ పార్లమెంట్ నుంచి తప్పుకుంటున్నట్లు నికరాగ్వా సంచలన ప్రకటన బీసీల హక్కుల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోంది... నాగండ్లలో నేత్రదానం కుమ్మరి సంఘ భవన నిర్మాణానికి సంపూర్ణ సహకారం అందజేస్తాము* నాగండ్ల లో నేత్రదానం నారా లోకేష్ సంకల్పం.. నాగపూర్‌లో ఫడ్నవీస్‌కు వివరించిన రవి నాయుడు మంగళవారం జాబ్ మేళా నేడు ప్రజా ఫిర్యాదుల నమోదు, పరిష్కార వేదిక పోలింగ్ బూత్ లను పరిశీలించిన యస్. ఐ.

ఎన్టీఆర్‌కు మద్దతుగా నిలిచిన విజయ్ దేవరకొండ: ఏఐ దుర్వినియోగంపై హీరో తీవ్ర ఆగ్రహం

Select Suryaa Now
ఎన్టీఆర్‌కు మద్దతుగా నిలిచిన విజయ్ దేవరకొండ: ఏఐ దుర్వినియోగంపై హీరో తీవ్ర ఆగ్రహం

సూర్య ఎంటర్‌టైన్‌మెంట్ డెస్క్: టాలీవుడ్ అగ్ర హీరో ఎన్టీఆర్ నటించిన దేవర చిత్రంలోని చుట్టమల్లే పాటకు సంబంధించిన ఏఐ వీడియో వివాహం ప్రస్తుతం సినీ వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతోంది. కృత్రిమ మేధను ఉపయోగించి మహిళలను కించపరిచేలా ఈ వీడియోను రూపొందించిన ఘటన అందరినీ దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ అమానుష ఘటనపై ఇప్పటికే ఎన్టీఆర్ తీవ్ర విచారం వ్యక్తం చేస్తూ తన నిరసనను గళమెత్తారు. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్‌కు బాసటగా నిలుస్తూ రౌడీ హీరో విజయ్ దేవరకొండ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని కొందరు తప్పుడు పనులకు వాడుతున్న తీరుపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

విజయ్ దేవరకొండ స్పందిస్తూ మానవీయ విలువల పరంగా మనం అత్యంత నీచమైన స్థాయికి దిగజారిపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనకు బాధ్యులైన వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టకూడదని, చట్టపరంగా కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఇలాంటి తప్పు చేయడానికి ఎవరైనా సాహసించాలంటేనే భయపడేలా కఠినమైన గుణపాఠం నేర్పాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. పిల్లలను మనం ఏ విధంగా పెంచుతున్నాం, అసలు ఎలాంటి సమాజంలో జీవిస్తున్నామనే తీవ్రమైన సందేహాలను ఈ ఉదంతం రేకెత్తిస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. కేవలం ఇతరులను బాధపెట్టడంలో ఆనందాన్ని వెతుక్కునేలా మనుషులు మారిపోవడం అత్యంత బాధాకరమని విజయ్ పేర్కొన్నారు.

ప్రపంచవ్యాప్తంగా ఏఐ వల్ల ఉద్యోగాలు కోల్పోతామనే భయాలు వ్యక్తమవుతుంటే, మరోవైపు కొందరు అసాఘిక శక్తులు ఈ సాంకేతికతను ఇలాంటి అవాంఛనీయ మరియు తప్పుడు పనులకు ఉపయోగించుకుంటున్నాయని విజయ్ మండిపడ్డారు. డిజిటల్ వేదికలపై జరిగే ఇలాంటి నేరాలను కేవలం సాధారణ విషయంగా తీసుకోకుండా, లైంగిక దాడితో సమానంగా పరిగణించి చట్టప్రకారం కఠిన శిక్షలు అమలు చేయాలని స్పష్టం చేశారు. ఈ దారుణ ఘటనను తీవ్రంగా వ్యతిరేకిస్తూ గళం ఎత్తుతున్న ప్రతి ఒక్కరికీ తన పూర్తి మద్దతు ఉంటుందని ఆయన పునరుద్ఘాటించారు. సెలబ్రిటీలు ఎదుర్కొంటున్న ఇలాంటి ఏఐ వేధింపుల అంశంపై టాలీవుడ్ ప్రముఖులు స్పందిస్తున్న తీరు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.