BREAKING
నేడు గార్లకు రానున్న ఎమ్మెల్యే కోరం కనకయ్య కార్నెల్ విశ్వవిద్యాలయ సామూహిక అత్యాచార బాధితురాలికి బెదిరింపులు రెడ్‌క్రాస్‌ జిల్లా చైర్మన్‌గా డాక్టర్‌ ఎస్‌.ఎం. రాజేశ్వర్‌రావు స్థానిక ఎన్నికలకు వైఎస్సార్‌సీపీ సన్నద్ధం పెనుగంచిప్రోలులో పార్టీ శ్రేణులకు సభ్యత్వ కార్డుల పంపిణీ ఏఐ మార్ఫింగ్ వీడియోలపై జాన్వీ కపూర్ ఆవేదన: అనుమతి లేకుండా మహిళల చిత్రాలతో కల్పిత కంటెంట్ లైంగిక దాడికి సమానమని వ్యాఖ్య, ఎన్టీఆర్, చిరంజీవికి కృతజ్ఞతలు రాంపల్లి మరో జవహర్‌నగర్‌గా మారొద్దు.. ! సెంట్రల్ అమెరికన్ పార్లమెంట్ నుంచి తప్పుకుంటున్నట్లు నికరాగ్వా సంచలన ప్రకటన బీసీల హక్కుల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోంది... నాగండ్లలో నేత్రదానం కుమ్మరి సంఘ భవన నిర్మాణానికి సంపూర్ణ సహకారం అందజేస్తాము* నాగండ్ల లో నేత్రదానం నారా లోకేష్ సంకల్పం.. నాగపూర్‌లో ఫడ్నవీస్‌కు వివరించిన రవి నాయుడు మంగళవారం జాబ్ మేళా నేడు ప్రజా ఫిర్యాదుల నమోదు, పరిష్కార వేదిక పోలింగ్ బూత్ లను పరిశీలించిన యస్. ఐ.

చకోర సినిమా టీమ్‌లో నిజాయితీ కనిపిస్తోంది: స్టార్ డైరెక్టర్ శివ నిర్వాణ ఆకాంక్ష

Select Suryaa Now
చకోర సినిమా టీమ్‌లో నిజాయితీ కనిపిస్తోంది: స్టార్ డైరెక్టర్ శివ నిర్వాణ ఆకాంక్ష

సూర్య ఎంటర్‌టైన్‌మెంట్ డెస్క్: మాస్ పోయెట్రీ మ్యూజికల్ లవ్ స్టోరీగా తెరకెక్కిన 'చకోర – Lunar Love Bird' సినిమాపై సినీ వర్గాల్లో మంచి అంచనాలు నెలకొన్నాయి. హై జాయ్ కమర్షియల్స్ బ్యానర్‌‌పై డాక్టర్ చింతాడ హేమారావు నిర్మించిన ఈ చిత్రానికి విఐపి వింటేజ్ ఐకానిక్ పిక్చర్స్ నిర్మాణ సారథ్యం వహించగా, మంగా శ్రీనివాస్ రచన మరియు దర్శకత్వం వహించారు. శ్రవణ్ మరియు మలైకా టి. వాసుపల్ జంటగా నటిస్తున్న ఈ సినిమా అక్టోబర్ తొమ్మిదవ తేదీన ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ థియేట్రికల్ విడుదలకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో విశాఖపట్నంలో ఘనంగా నిర్వహించిన ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్‌‌కు స్టార్ డైరెక్టర్ శివ నిర్వాణ ముఖ్య అతిథిగా విచ్చేసి చిత్ర యూనిట్‌కు శుభాకాంక్షలు తెలిపారు.

ఈ వేడుకలో సినిమా విశేషాలను చిత్ర యూనిట్ సభ్యులు పంచుకున్నారు. డిఓపి రుప్ప గోపీకృష్ణ మాట్లాడుతూ, ఈ చిత్రాన్ని ఒక ఛాలెంజ్‌లా తీసుకుని కేవలం నలభై ఐదు రోజుల్లోనే షూటింగ్ పూర్తి చేశామని, సినిమా అందరినీ ఆకట్టుకుంటుందని తెలిపారు. హీరోయిన్ అనుష్క లూహార్ మరియు మలైకా టి. వాసుపల్ మాట్లాడుతూ, తెలుగు తెరపై మంచి అవకాశంతో వస్తున్న ఈ క్యూట్ రొమాంటిక్ ఫీల్ గుడ్ లవ్ స్టోరీ ప్రేక్షకులకు తప్పకుండా నచ్చుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. నటుడు సుమన్, నిర్మాత డాక్టర్ చింతాడ హేమారావు మాట్లాడుతూ, చకోర పక్షి ఆదర్శాలను జోడించి తెరకెక్కించిన ఈ భిన్నమైన ప్రేమకథను ప్రేక్షకులు ఆదరించి విజయవంతం చేయాలని కోరారు.

హీరో శ్రవణ్ మాట్లాడుతూ, సినిమా ట్రైలర్‌లో చూపించినదానికంటే ఎన్నో సర్ప్రైజింగ్ ట్విస్టులు సినిమాలో ఉంటాయని, అక్టోబర్ 9న థియేటర్లలో సినిమా చూసి ఎంజాయ్ చేయాలని పిలుపునిచ్చారు. దర్శకుడు మంగా శ్రీనివాస్ మాట్లాడుతూ, చకోర పక్షి స్వచ్ఛమైన ప్రేమ మరియు లక్ష్య సాధనను ఈ చిత్రంలో అందంగా ఆవిష్కరించామని, జెన్ జీ ప్రేమకథగా, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా ప్రేక్షకులను అలరిస్తుందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న స్టార్ డైరెక్టర్ శివ నిర్వాణ మాట్లాడుతూ, ఈ చిత్రంలో పనిచేసిన ప్రతి ఒక్కరిలోనూ పని పట్ల నిజాయితీ స్పష్టంగా కనిపిస్తోందని ప్రశంసించారు. విశాఖ గడ్డ నుంచి తెలుగు చలనచిత్ర పరిశ్రమకు ఎంతోమంది ప్రముఖ దర్శకులు పరిచయమయ్యారని, అదే కోవలో దర్శకుడు మంగా శ్రీనివాస్ కూడా మంచి విజయం సాధించాలని ఆకాంక్షించారు. నూతన నటీనటులు, టెక్నీషియన్లు ఎంతో ప్రతిభ కనబరిచారని, ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ సక్సెస్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు ఆయన పేర్కొన్నారు.