BREAKING
నేడు గార్లకు రానున్న ఎమ్మెల్యే కోరం కనకయ్య కార్నెల్ విశ్వవిద్యాలయ సామూహిక అత్యాచార బాధితురాలికి బెదిరింపులు రెడ్‌క్రాస్‌ జిల్లా చైర్మన్‌గా డాక్టర్‌ ఎస్‌.ఎం. రాజేశ్వర్‌రావు స్థానిక ఎన్నికలకు వైఎస్సార్‌సీపీ సన్నద్ధం పెనుగంచిప్రోలులో పార్టీ శ్రేణులకు సభ్యత్వ కార్డుల పంపిణీ ఏఐ మార్ఫింగ్ వీడియోలపై జాన్వీ కపూర్ ఆవేదన: అనుమతి లేకుండా మహిళల చిత్రాలతో కల్పిత కంటెంట్ లైంగిక దాడికి సమానమని వ్యాఖ్య, ఎన్టీఆర్, చిరంజీవికి కృతజ్ఞతలు రాంపల్లి మరో జవహర్‌నగర్‌గా మారొద్దు.. ! సెంట్రల్ అమెరికన్ పార్లమెంట్ నుంచి తప్పుకుంటున్నట్లు నికరాగ్వా సంచలన ప్రకటన బీసీల హక్కుల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోంది... నాగండ్లలో నేత్రదానం కుమ్మరి సంఘ భవన నిర్మాణానికి సంపూర్ణ సహకారం అందజేస్తాము* నాగండ్ల లో నేత్రదానం నారా లోకేష్ సంకల్పం.. నాగపూర్‌లో ఫడ్నవీస్‌కు వివరించిన రవి నాయుడు మంగళవారం జాబ్ మేళా నేడు ప్రజా ఫిర్యాదుల నమోదు, పరిష్కార వేదిక పోలింగ్ బూత్ లను పరిశీలించిన యస్. ఐ.

సంస్కార భారతి ఆధ్వర్యంలో బతుకమ్మ ఉత్సవాలను ఘనంగా నిర్వహిద్దాం : రాష్ట్ర సంఘటన మంత్రి జిపి నిరంజన్

Select Suryaa Now
సంస్కార భారతి ఆధ్వర్యంలో బతుకమ్మ ఉత్సవాలను ఘనంగా నిర్వహిద్దాం : రాష్ట్ర సంఘటన మంత్రి జిపి నిరంజన్

నారాయణపేట, సూర్యన్యూస్ : 
సంస్కార భారతి జిల్లా సమితి సమావేశం ఆదివారం నారాయణపేట పట్టణంలోని రాగమయి సంగీత నృత్య శిక్షణ కేంద్రంలో నిర్వహించారు. దీనికి ముఖ్య అతిథులుగా తెలంగాణ రాష్ట్ర సంఘటన మంత్రి జిపి నిరంజన్ హాజరై మాట్లాడారు. ఈ ఏడాదిలో రాబోయే కార్యక్రమాలపై సమావేశంలో దిశ నిర్దేశం చేశారు.సంస్కార భారతి నారాయణపేట జిల్లా సమితి ఆధ్వర్యంలో దసరా పండుగకు బతుకమ్మ ఉత్సవాలు పెద్ద ఎత్తున నిర్వహించాలని, బతుకమ్మ పాటలు పాడుతూ ప్రకృతి పూల తోటి బతుకమ్మను చేస్తూ గౌరమ్మ తల్లిని గౌరవిస్తూ సాంప్రదాయానికి పెద్ద పీట వేయాలని కోరారు. డీజీలు ఉపయోగించకుండా మహిళలు సొంతంగా పాటలు పాడుతూ బతుకమ్మ చేయాలని విజ్ఞప్తి చేశారు. భక్తి శ్రద్ధలతో బతుకమ్మ కార్యక్రమాలను జిల్లా స్థాయిలో పెద్ద ఎత్తున నిర్వహించాలని సూచించారు. అనంతరం బతుకమ్మ పోస్టర్ విడదల చేశారు. ఈ సమావేశంలో సంస్కార భారతి నారాయణపేట జిల్లా సమితి ఉపాధ్యక్షులు రామకృష్ణ కళ్యాణి, ప్రధాన కార్యదర్శి మల్లేష్ దేశాయ్, సంయుక్త ప్రధాన కార్యదర్శి దీపిక ప్రసాద శెట్టి, మాతృ శక్తి కన్వీనర్ భారతి, ప్రచార సమితి కన్వీనర్ కానగడ్డ భీమప్ప, కార్యదర్శిలు వసంత్ కుమార్, శ్రీకాంత్ ఎడిగే, సాహిత్యప్రముఖ్ తాటి కృష్ణ, ప్రకాష్ రావు, స్వాతి, రేణుక, హరిణి, రవితేజ, రవి, అలేఖ్య సభ్యులు పాల్గొన్నారు.

-- *రాజేష్ కుమార్, సూర్య రిపోర్టర్ నారాయణపేట*