35 రూపాయలకే కిలో ఉల్లిపాయలు
కందుకూరులో అమ్మకం కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే ఇంటూరి
కందుకూరు: ఎల్ నినో ప్రభావంతో నిత్యవసర వస్తువుల ధరలు పెరుగుతున్న నేపథ్యంలో వాటిని తక్కువ ధరకే ప్రజలకు అందించాలన్న సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తోంది.
కిలో ఉల్లిపాయల ధర 60-65 రూపాయల వరకు ఉండగా కేవలం 35 రూపాయలకే అందించేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది.ఇందులో భాగంగా కందుకూరు రైతు బజార్లో ఏర్పాటు చేసిన ఉల్లిపాయల అమ్మకం కేంద్రాన్ని కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు ఆదివారం ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో ఏఎంసి చైర్మన్ రాయపాటి సుభాషిణి, ప్రకాశం జిల్లా మార్కెటింగ్ ఎ.డి వరలక్ష్మి, ఎన్ఫోర్స్మెంట్ డి.టి విజయ్ భాస్కర్ రైతు బజార్ ఎస్టేట్ ఆఫీసర్ స్వరూపారాణి రాష్ట్ర విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ చిలకపాటి మధుబాబు, కందుకూరు పట్టణ టిడిపి అధ్యక్షులు దామా మల్లేశ్వరరావు, కందుకూరు మండల పార్టీ అధ్యక్షులు బుస్సారెడ్డి కృష్ణారెడ్డి, ఏఎంసీ డైరెక్టర్ కొత్తూరు సుధాకర్, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ ఉప్పుటూరి శ్రీనివాసరావు, పార్టీ నాయకులు వడ్డెళ్ళ రవిచంద్ర, షేక్ రఫీ, షేక్ సలాం, సయ్యద్ రూబీ, షేక్ నజీర్, జియావుద్దీన్, మురారిశెట్టి వెంకట సుబ్బారావు కూనం నరేంద్ర ఇతర నాయకులు పాల్గొన్నారు..