BREAKING
దేవర చుట్టమల్లే ఏఐ మార్ఫింగ్ వీడియోపై కుష్బూ సుందర్ తీవ్ర ఆగ్రహం.. మహిళల గౌరవం ఆటవస్తువు కాదంటూ ఘాటు వ్యాఖ్యలు ఎన్నికల సంఘం స్వతంత్ర తను కాపాడా లి ఎస్ ఐ ఆర్ ప్రక్రియ ను నిలిపివేయాలి... సీపీఐ - సిపిఎం… ఎన్నికల సంఘం స్వతంత్రతను కాపాడాలి నేడు గార్లకు రానున్న ఎమ్మెల్యే కోరం కనకయ్య కార్నెల్ విశ్వవిద్యాలయ సామూహిక అత్యాచార బాధితురాలికి బెదిరింపులు రెడ్‌క్రాస్‌ జిల్లా చైర్మన్‌గా డాక్టర్‌ ఎస్‌.ఎం. రాజేశ్వర్‌రావు స్థానిక ఎన్నికలకు వైఎస్సార్‌సీపీ సన్నద్ధం పెనుగంచిప్రోలులో పార్టీ శ్రేణులకు సభ్యత్వ కార్డుల పంపిణీ ఏఐ మార్ఫింగ్ వీడియోలపై జాన్వీ కపూర్ ఆవేదన: అనుమతి లేకుండా మహిళల చిత్రాలతో కల్పిత కంటెంట్ లైంగిక దాడికి సమానమని వ్యాఖ్య, ఎన్టీఆర్, చిరంజీవికి కృతజ్ఞతలు రాంపల్లి మరో జవహర్‌నగర్‌గా మారొద్దు.. ! సెంట్రల్ అమెరికన్ పార్లమెంట్ నుంచి తప్పుకుంటున్నట్లు నికరాగ్వా సంచలన ప్రకటన బీసీల హక్కుల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోంది... నాగండ్లలో నేత్రదానం కుమ్మరి సంఘ భవన నిర్మాణానికి సంపూర్ణ సహకారం అందజేస్తాము* నాగండ్ల లో నేత్రదానం నారా లోకేష్ సంకల్పం.. నాగపూర్‌లో ఫడ్నవీస్‌కు వివరించిన రవి నాయుడు మంగళవారం జాబ్ మేళా

జాతీయ స్థాయి మేళాకి నారాయణపేట విద్యార్థి ఎంపిక

Select Suryaa Now
జాతీయ స్థాయి మేళాకి నారాయణపేట విద్యార్థి ఎంపిక

నారాయణపేట, సూర్యన్యూస్ : 
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, విజయవాడ సమీపంలోని నూతక్కిలో గత మూడు రోజులుగా నిర్వహించిన దక్షిణ మధ్యక్షేత్ర గణిత, విజ్ఞాన, సంస్కృతీ మేళాలో నారాయణపేట పట్టణంలోని శ్రీ సరస్వతీ శిశు మందిర్ ఉన్నత పాఠశాల విద్యార్థి చి. ప్రవీణ్ కుమార్ అద్భుత ప్రతిభ కనబరిచాడు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల శిశు మందిరాల విద్యార్థులు పాల్గొన్న ఈ పోటీల్లో విజేతగా నిలిచి, జాతీయ స్థాయికి ఎంపికయ్యాడు. నూతక్కిలోని జ్ఞాన విహార్ పాఠశాలలో జరిగిన ఈ ప్రతిష్టాత్మక మేళాలో మూడు రాష్ట్రాల నుండి ఎంపికైన ఉత్తమ విద్యార్థులు పాల్గొన్నారు. తీవ్రమైన పోటీ నెలకొన్నప్పటికీ, కిశోర వర్గ విభాగంలో నిర్వహించిన మట్టి విగ్రహాల తయారీ పోటీలో ప్రవీణ్ కుమార్ తనంసృజనాత్మకత, నైపుణ్యంతో అత్యంత ఆకర్షణీయమైన విగ్రహాలను రూపొందించి న్యాయనిర్ణేతల ప్రశంసలు అందుకున్నాడు. మూడు రాష్ట్రాల విద్యార్థులను వెనక్కి నెట్టి ఈ పోటీలో ప్రథమ స్థానాన్ని కైవసం చేసుకున్నాడు. ఈ విజయంతో ప్రవీణ్ కుమార్ అఖిల భారత (జాతీయ) స్థాయి గణిత, విజ్ఞాన, సంస్కృతీ మేళా పోటీలకు అర్హత సాధించాడు. జాతీయ స్థాయిలో జరిగే పోటీల్లో కూడా అత్యుత్తమ ప్రదర్శన కనబరిచి, పాఠశాలకు, జిల్లాకు మరియు తెలంగాణ రాష్ట్రానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షిస్తున్నారు. ప్రవీణ్ కుమార్ సాధించిన ఈ విజయం పట్ల పాఠశాల ప్రధానాచార్యులు దత్తు చౌదరి, ఆచార్య బృందం, పాఠశాల కమిటీ సభ్యులు మరియు తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు. అతడిని ప్రత్యేకంగా అభినందించి, జాతీయ స్థాయి పోటీల్లో విజయం సాధించాలని ఆకాంక్షించారు.

-- *రాజేష్ కుమార్, సూర్య రిపోర్టర్ నారాయణపేట*