BREAKING
నేడు గార్లకు రానున్న ఎమ్మెల్యే కోరం కనకయ్య కార్నెల్ విశ్వవిద్యాలయ సామూహిక అత్యాచార బాధితురాలికి బెదిరింపులు రెడ్‌క్రాస్‌ జిల్లా చైర్మన్‌గా డాక్టర్‌ ఎస్‌.ఎం. రాజేశ్వర్‌రావు స్థానిక ఎన్నికలకు వైఎస్సార్‌సీపీ సన్నద్ధం పెనుగంచిప్రోలులో పార్టీ శ్రేణులకు సభ్యత్వ కార్డుల పంపిణీ ఏఐ మార్ఫింగ్ వీడియోలపై జాన్వీ కపూర్ ఆవేదన: అనుమతి లేకుండా మహిళల చిత్రాలతో కల్పిత కంటెంట్ లైంగిక దాడికి సమానమని వ్యాఖ్య, ఎన్టీఆర్, చిరంజీవికి కృతజ్ఞతలు రాంపల్లి మరో జవహర్‌నగర్‌గా మారొద్దు.. ! సెంట్రల్ అమెరికన్ పార్లమెంట్ నుంచి తప్పుకుంటున్నట్లు నికరాగ్వా సంచలన ప్రకటన బీసీల హక్కుల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోంది... నాగండ్లలో నేత్రదానం కుమ్మరి సంఘ భవన నిర్మాణానికి సంపూర్ణ సహకారం అందజేస్తాము* నాగండ్ల లో నేత్రదానం నారా లోకేష్ సంకల్పం.. నాగపూర్‌లో ఫడ్నవీస్‌కు వివరించిన రవి నాయుడు మంగళవారం జాబ్ మేళా నేడు ప్రజా ఫిర్యాదుల నమోదు, పరిష్కార వేదిక పోలింగ్ బూత్ లను పరిశీలించిన యస్. ఐ.

సాగర్ ఆయకట్టుకు గోదావరి జలాలు.. మంత్రి తుమ్మల

Select Suryaa Now
సాగర్ ఆయకట్టుకు గోదావరి జలాలు.. మంత్రి తుమ్మల

---సాగర్‌ ఆయకట్టుకు గోదావరి జలాలు
--పంటలను కాపాడేందుకు చివరి తడికి నీటి విడుదల --మంత్రి తుమ్మల వెల్లడి
--లిఫ్ట్‌ ఇరిగేషన్‌ స్కీములకు విద్యుత్‌ సరఫరా
--రైతులు ఆందోళన చెందొద్దు.. నీటిని పొదుపుగా వినియోగించుకోవాలి
---సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశాలతో ప్రత్యేక చర్య

: ఉమ్మడి ఖమ్మం భద్రత కొత్తగూడెం జిల్లా బ్యూరో ::పసుపులేటి సత్యనారాయణ

తీవ్ర వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో సాగర్‌ ఆయకట్టు పరిధిలో ఇప్పటికే సాగు చేసిన పంటలను కాపాడేందుకు చివరి తడికి నీటిని విడుదల చేస్తున్నామని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. రైతుల విజ్ఞప్తి మేరకు సీతారామ ప్రాజెక్టు నుంచి గోదావరి జలాలను సాగర్‌ ఆయకట్టుకు విడుదల చేస్తున్నామని చెప్పారు. పంటలు ఎండిపోకుండా అవసరమైన నీటిని అందించేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందన్నారు.
రాష్ట్రంలో విద్యుత్‌ కొరత ఉన్నప్పటికీ రైతాంగ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని గోదావరి జలాలను విడుదల చేస్తున్నామని మంత్రి పేర్కొన్నారు. సాగర్‌ ఆయకట్టుతోపాటు అశ్వారావుపేట, కొత్తగూడెం, పినపాక, వైరా, సత్తుపల్లి నియోజకవర్గాలకు కూడా అదనంగా నీటిని విడుదల చేస్తున్నట్లు తెలిపారు.

---ఆయకట్టు, ప్రాజెక్టులకు నీరు..

పినపాక నియోజకవర్గంలోని తుమ్మల చెరువు ఆయకట్టుకు, అలాగే వైరా ప్రాజెక్టు, వెంగళరాయసాగర్‌ ప్రాజెక్టు, సింగభూపాలెం ప్రాజెక్టు, లంకాసాగర్‌ ప్రాజెక్టులకు కూడా గోదావరి జలాలను అందించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి తెలిపారు. ఆయా ప్రాజెక్టులు, చెరువుల పరిధిలోని ఆయకట్టుకు నీరు అందించి సాగు చేసిన పంటలను కాపాడేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు.

--లిఫ్ట్‌లకు విద్యుత్‌ సరఫరా..

పంటలను కాపాడుకునేందుకు అందుబాటులో ఉన్న అన్ని నీటి వనరులను వినియోగించుకుంటున్నామని తుమ్మల తెలిపారు. లిఫ్ట్‌ ఇరిగేషన్‌ స్కీములకు కూడా విద్యుత్‌ సరఫరా చేయనున్నట్లు పేర్కొన్నారు. లిఫ్ట్‌ల ద్వారా అందుబాటులో ఉన్న నీటిని పొలాలకు అందించి పంటలను కాపాడేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు.

---సీఎం ఆదేశాలతో ప్రత్యేక చర్యలు..

తీవ్ర వర్షాభావ పరిస్థితులు, నీటి లభ్యతలో ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సాగు చేసిన పంటలను కాపాడేందుకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశాల మేరకు నీటిని విడుదల చేస్తున్నట్లు మంత్రి తుమ్మల తెలిపారు. రైతాంగం ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, పంటల పరిరక్షణకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.

--నీటిని వృథా చేయొద్దు...

ప్రస్తుతం అందుబాటులో ఉన్న గోదావరి జలాలను రైతులు పొదుపుగా వినియోగించుకోవాలని తుమ్మల సూచించారు. నీటిని వృథా చేయకుండా సద్వినియోగం చేసుకుంటే మరింత విస్తీర్ణంలోని పంటలను కాపాడేందుకు అవకాశం ఉంటుందని తెలిపారు. తీవ్ర వర్షాభావ పరిస్థితుల్లో అందుబాటులో ఉన్న ప్రతి నీటి వనరును సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు.
సాగర్‌ ఆయకట్టు పరిధిలో ఇప్పటికే వేసిన పంటలకు చివరి తడి అందించడమే లక్ష్యంగా నీటి విడుదల చేపట్టామని మంత్రి స్పష్టం చేశారు. సాగర్‌ ఆయకట్టుతోపాటు పినపాక నియోజకవర్గంలోని తుమ్మల చెరువు ఆయకట్టు, వైరా, వెంగలరాయ సాగర్‌, సింగభూపాలెం, లంకాసాగర్‌ ప్రాజెక్టుల పరిధిలోని ఆయకట్టుకు నీరు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. రైతుల పంటలను కాపాడేందుకు నీటి విడుదలతోపాటు లిఫ్ట్‌ ఇరిగేషన్‌ పథకాలకు విద్యుత్‌ సరఫరా చేసి అన్ని విధాలుగా సహకరిస్తామని తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు.