BREAKING
ఎన్నికల సంఘం స్వతంత్ర తను కాపాడా లి ఎస్ ఐ ఆర్ ప్రక్రియ ను నిలిపివేయాలి... సీపీఐ - సిపిఎం… ఎన్నికల సంఘం స్వతంత్రతను కాపాడాలి నేడు గార్లకు రానున్న ఎమ్మెల్యే కోరం కనకయ్య కార్నెల్ విశ్వవిద్యాలయ సామూహిక అత్యాచార బాధితురాలికి బెదిరింపులు రెడ్‌క్రాస్‌ జిల్లా చైర్మన్‌గా డాక్టర్‌ ఎస్‌.ఎం. రాజేశ్వర్‌రావు స్థానిక ఎన్నికలకు వైఎస్సార్‌సీపీ సన్నద్ధం పెనుగంచిప్రోలులో పార్టీ శ్రేణులకు సభ్యత్వ కార్డుల పంపిణీ ఏఐ మార్ఫింగ్ వీడియోలపై జాన్వీ కపూర్ ఆవేదన: అనుమతి లేకుండా మహిళల చిత్రాలతో కల్పిత కంటెంట్ లైంగిక దాడికి సమానమని వ్యాఖ్య, ఎన్టీఆర్, చిరంజీవికి కృతజ్ఞతలు రాంపల్లి మరో జవహర్‌నగర్‌గా మారొద్దు.. ! సెంట్రల్ అమెరికన్ పార్లమెంట్ నుంచి తప్పుకుంటున్నట్లు నికరాగ్వా సంచలన ప్రకటన బీసీల హక్కుల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోంది... నాగండ్లలో నేత్రదానం కుమ్మరి సంఘ భవన నిర్మాణానికి సంపూర్ణ సహకారం అందజేస్తాము* నాగండ్ల లో నేత్రదానం నారా లోకేష్ సంకల్పం.. నాగపూర్‌లో ఫడ్నవీస్‌కు వివరించిన రవి నాయుడు మంగళవారం జాబ్ మేళా నేడు ప్రజా ఫిర్యాదుల నమోదు, పరిష్కార వేదిక

అంబేద్కర్ లేకుంటే మన బ్రతుకులు ఏమయ్యేవి…?

Select Suryaa Now
అంబేద్కర్ లేకుంటే మన బ్రతుకులు ఏమయ్యేవి…?

దేశ ప్రజల తలరాతలు మార్చిన మహనీయుడు బాబాసాహెబ్ అంబేద్కర్

కీసర మండల అంబేద్కర్ సంఘం అధ్యక్షుడు కర్రె గణేష్ 

కీసర, మేజర్ న్యూస్, (అక్టోబర్ 4): భారత రాజ్యాంగ నిర్మాత, విశ్వరత్న డాక్టర్‌ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు రాజ్యాంగ హక్కులు, చట్టాలపై అవగాహన కల్పించాలనే లక్ష్యంతో నిర్వహిస్తున్న జ్ఞానమాల కార్యక్రమం అహ్మద్‌గూడ అర్జీకే కాలనీలో ఘనంగా జరిగింది. ప్రతి ఆదివారం నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో భాగంగా 36వ వారం జ్ఞానమాల కార్యక్రమానికి కీసర మండల అంబేద్కర్ సంఘం అధ్యక్షుడు కర్రె గణేష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా కర్రె గణేష్ మాట్లాడుతూ.. “అంబేద్కర్ లేకుంటే మన బ్రతుకులు ఏమయ్యేవి?” అనే ప్రశ్నను ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిన అవసరం ఉందన్నారు. దేశ ప్రజల తలరాతలను మార్చిన మహనీయుడు బాబాసాహెబ్ అంబేద్కర్ అని పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా అంబేద్కర్‌ను గొప్ప జ్ఞానవంతుడిగా, మేధావిగా గుర్తించారని, భారతదేశం గర్వించదగ్గ ముద్దుబిడ్డగా ఆయన నిలిచారని అన్నారు.ప్రజలకు పరిపాలనను మరింత చేరువ చేయడంతో పాటు రాజ్యాంగం, చట్టాలు, హక్కులపై అవగాహన కల్పించేందుకు కీసర మండలంలో జ్ఞానమాల కార్యక్రమాన్ని ప్రారంభించి గ్రామాల వారీగా విస్తరిస్తున్నట్లు తెలిపారు. అంబేద్కర్ రూపొందించిన రాజ్యాంగం ద్వారా దేశంలోని ప్రతి పౌరుడికి సమాన హక్కులు, సమానత్వం కల్పించబడిందన్నారు. కులం, మతంతో సంబంధం లేకుండా సమాజంలోని అన్ని వర్గాలకు సమానత్వం కోసం అంబేద్కర్ చేసిన కృషి చిరస్మరణీయమని పేర్కొన్నారు.అంబేద్కర్ ఆశయాలను కేవలం జయంతి వేడుకలకే పరిమితం చేయకుండా ఆయన ఆలోచనా విధానాన్ని ప్రతి గ్రామానికి, ప్రతి కుటుంబానికి తీసుకెళ్లాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు. ప్రజలకు తమ హక్కులు, బాధ్యతలపై అవగాహన కల్పిస్తూ సమానత్వ సమాజ నిర్మాణానికి కృషి చేయడమే జ్ఞానమాల కార్యక్రమం ప్రధాన లక్ష్యమని నిర్వాహకులు తెలిపారు.కార్యక్రమానికి అర్జీకే అంబేద్కర్ సంఘం గౌరవ అధ్యక్షుడు మంగళపురి వెంకటేష్, అధ్యక్షుడు గొల్ల రాజులు ఆహ్వానం పలికారు. కీసర మండల అంబేద్కర్ సంఘం కోశాధికారి రొండ్ల మహేష్, సంయుక్త కార్యదర్శి తాళ్ల కిరణ్, కీసర బీఆర్‌ఎస్ గ్రామశాఖ అధ్యక్షుడు చినింగని బాల్‌రాజ్, పెద్ద పర్వతపూర్ శశికాంత్, అర్జీకే కాలనీ వాసులు సురేష్, ప్రసాద్, సాయిబాబా, పరుశారాం తదితరులు పాల్గొన్నారు.

రిపోర్టర్ కర్రె గణేష్.