BREAKING
ఎన్నికల సంఘం స్వతంత్ర తను కాపాడా లి ఎస్ ఐ ఆర్ ప్రక్రియ ను నిలిపివేయాలి... సీపీఐ - సిపిఎం… ఎన్నికల సంఘం స్వతంత్రతను కాపాడాలి నేడు గార్లకు రానున్న ఎమ్మెల్యే కోరం కనకయ్య కార్నెల్ విశ్వవిద్యాలయ సామూహిక అత్యాచార బాధితురాలికి బెదిరింపులు రెడ్‌క్రాస్‌ జిల్లా చైర్మన్‌గా డాక్టర్‌ ఎస్‌.ఎం. రాజేశ్వర్‌రావు స్థానిక ఎన్నికలకు వైఎస్సార్‌సీపీ సన్నద్ధం పెనుగంచిప్రోలులో పార్టీ శ్రేణులకు సభ్యత్వ కార్డుల పంపిణీ ఏఐ మార్ఫింగ్ వీడియోలపై జాన్వీ కపూర్ ఆవేదన: అనుమతి లేకుండా మహిళల చిత్రాలతో కల్పిత కంటెంట్ లైంగిక దాడికి సమానమని వ్యాఖ్య, ఎన్టీఆర్, చిరంజీవికి కృతజ్ఞతలు రాంపల్లి మరో జవహర్‌నగర్‌గా మారొద్దు.. ! సెంట్రల్ అమెరికన్ పార్లమెంట్ నుంచి తప్పుకుంటున్నట్లు నికరాగ్వా సంచలన ప్రకటన బీసీల హక్కుల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోంది... నాగండ్లలో నేత్రదానం కుమ్మరి సంఘ భవన నిర్మాణానికి సంపూర్ణ సహకారం అందజేస్తాము* నాగండ్ల లో నేత్రదానం నారా లోకేష్ సంకల్పం.. నాగపూర్‌లో ఫడ్నవీస్‌కు వివరించిన రవి నాయుడు మంగళవారం జాబ్ మేళా నేడు ప్రజా ఫిర్యాదుల నమోదు, పరిష్కార వేదిక

జనవిజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో వైద్య శిభిరం

Select Suryaa Now
జనవిజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో వైద్య శిభిరం

జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో వైద్య శిభిరం 
--విశేష స్పందన 
ఆత్మకూరు, మేజర్ న్యూస్, సోమ వెంకటసుబ్బయ్  :ఆత్మకూరులో జనవిజ్ఞాన వేదిక 
ఆధ్వర్యంలో డాక్టర్ జెట్టి శేషారెడ్డి విజ్ఞాన కేంద్రం  సహకారంతో ప్రతి 2 నెలలకు ఒకసారి నిర్వహించు వైద్య శిభిరాన్ని ఆదివారం నిర్వహించారు. శిభిరంలో జనాలు అధికంగా పాల్గొని వైద్య సేవలు పొందారు. శిభిరంలో విశేష స్పందన లభించింది.షుగర్, బీపీ మరియు గుండె సంబంధిత వ్యాధుల వైద్య శిబిరం ను శ్రీ షిరిడి సాయిరాం కళాశాలలో నిర్వహించారు.
ఉదయం 7 గంటల నుండి11 గంటల వరకు
నిర్వహించగా ఈ వైద్య శిబిరమునకు నెల్లూరు రామచంద్రారెడ్డి ప్రజా వైద్యశాల నుండి ప్రముఖ వైద్యులు డాక్టర్ ఎం.వి.రమణయ్య  మరియు నెల్లూరు మెడికవర్ హాస్పిటల్ నుండి ప్రముఖ గుండెవ్యాధి నిపుణులు డాక్టర్ ఎం .బాలకృష్ణ  విచ్చేసి ప్రజలకు వైద్య సేవాలాందించారు.  బీపీ .షుగర్, గుండె సంబంధిత వ్యాధులతో బాధపడు వారు వైద్య పరీక్షలు చేయించుకున్నారు.
షుగర్ టెస్ట్  1సారి చేయించుకున్న వారికి 25 రూపాయలు,ఆహారం తిన్న తర్వాత రెండో సారి కూడా చేయించుకునే వారు మరో 25 రూపాయలు చెల్లించేలా నిర్ణయించారు.ఇన్సులిన్ ఒకటికి 100 రూపాయలు వంతున అందజేశామని నిర్వాహకులు పేర్కొన్నారు.
రెండు నెలలకు (షుగర్ మరియు బిపి లకు)అవసరమగు మందులు కేవలం 250 రూపాయలకే అందించారు. ఈ శిభిరంలో స్థానిక అపోలో ల్యాబ్ నిర్వాహకులు సంధాని టెస్టులు చేశారు. ఈ కార్యక్రమంలో సి ఐ టి యూ జిల్లా నాయకుడు జి. వి. శివప్రసాద్, జీవివి నాయకులు ఒంటేరు మల్లికార్జున తదితరులు పాల్గొన్నారు.